E-Paper
Advertisement

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Sports Drama Series: స్పోర్ట్స్ అండ్ మెంటర్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కథలకు ఎప్పుడూ ఒక క్రేజీ డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు గోల్ఫ్ ఆటలో నెక్స్ట్ లెవెల్ స్టార్ అవుతాడనుకుని, మైదానంలో జరిగిన ఒక చిన్న మెల్ట్‌డౌన్ వల్ల కెరీర్ కోల్పోయిన ప్లేయర్ జీవితంలోకి 17 ఏళ్ల అద్భుతమైన గోల్ఫ్ ప్రతిభ ఉన్న కుర్రాడు శాంతి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో చూపించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ సిరీస్ ‘స్టిక్’ (Stick). ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది ఈ మోటివేషనల్ అండ్ స్పోర్ట్స్ డ్రామా  సీజన్ 2. ఓడిపోయిన ఇద్దరు వ్యక్తులు కలిసి సమాజంపై ఎలా గెలిచారు అనే థీమ్‌తో వచ్చి, గ్లోబల్ వైడ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది ‘Stick: Season 2’.

కథలోకి వెళ్తే..

మెయిన్ లీడ్ అయిన ప్రైస్ కాహిల్ ఒకప్పుడు తన ఆటతో దేశాన్ని ఊపేసిన ఒక స్టార్ ప్లేయర్. కానీ కొన్ని బ్యాడ్ డెసిషన్స్, పర్సనల్ లైఫ్ లో ట్రాజెడీల వల్ల కెరీర్ కోల్పోయి, అందరి దృష్టిలో ఒక ఫెయిల్యూర్ లా మిగిలిపోతాడు. సమాజానికి దూరంగా బతుకుతున్న అతని లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు 17 ఏళ్ల ఒక కుర్రాడు. ఆ కుర్రాడికి విపరీతమైన టాలెంట్ ఉంటుంది కానీ సరైన గైడెన్స్ ఉండదు, పైగా ఎవరూ నమ్మని ఒక రెబెల్ పర్సనాలిటీ. ఆ 17 ఏళ్ల కుర్రాడిని ఒక గ్లోబల్ ఛాంపియన్‌గా మార్చే బాధ్యతను ఈ మాజీ స్టార్ ప్లేయర్ తన భుజాలపై వేసుకుంటాడు. సీజన్ 1 లో భార్యతో విడాకులు, కెరీర్ నాశనమై డిప్రెషన్‌లో ఉన్న ప్రైస్ కాహిల్ …  17 ఏళ్ల గోల్ఫ్ ఫెనామినన్ కి మెంటార్‌గా మారి అతడిని తీర్చిదిద్దుతాడు.

Advertisement

ఇక తాజా సీజన్ 2 లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రైస్ కాహిల్ కేవలం ఆ కుర్రాడిని ఛాంపియన్‌గా మార్చడమే కాకుండా, తన 20 ఏళ్ల ఫెయిల్యూర్ ముద్రను చెరిపేసుకుంటూ తానే స్వయంగా యూఎస్ ఓపెన్ (US Open) లో ఆడి హిస్టరీలోనే ఓల్డెస్ట్ ప్లేయర్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. యూఎస్ ఓపెన్ లాంటి అత్యంత కఠినమైన టోర్నమెంట్‌లో ఈ గురుశిష్యుల జోడి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, సరికొత్త ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా బిల్డ్ అయ్యాయనేది చాలా ఫీల్ గుడ్‌గా చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే?   

క్రీడల నేపథ్యంలో వచ్చిన ‘Stick: Season 2’ యాపిల్ టీవీ ప్లస్ (Apple TV+) లో 2026 నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ తో లభ్యమవుతోంది. విజువల్ క్వాలిటీ, ఎమోషనల్ కనెక్టివిటీ పరంగా ఈ సిరీస్ కి ఆపిల్ టీవీ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఓవెన్ విల్సన్ తనదైన విట్టీ కామెడీ టైమింగ్, హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్‌తో ప్రైస్ క్యారెక్టర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ సీజన్‌లో గోల్డెన్ గ్లోబ్ విన్నర్ రియా సీహోర్న్ (Rhea Seehorn) నటన అదనపు అట్రాక్షన్. లీడ్ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ, మోటివేషనల్ డైలాగ్స్ ఈ సిరీస్‌ను వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా నిలబెట్టాయి.

Advertisement

Read Also: బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌… జాతి వివక్షను ఎదిరించి ప్రపంచాన్నే షేక్ చేసిన బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ రియల్ స్టోరీ

Tags

Related News

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌… జాతి వివక్షను ఎదిరించి ప్రపంచాన్నే షేక్ చేసిన బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ రియల్ స్టోరీ

ట్విస్ట్ అంటే ఇదీ… మర్డర్ కేసు కోసం మగాడిగా మారే లేడీ డిటెక్టివ్… మతిపోగొట్టే మలుపులున్న కామెడీ సిరీస్

బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడుపుదామని వెళ్తే గుండె జారిపోయే ట్విస్ట్… దీన్ని చూశాక ప్రియుడిని పొరపాటున కూడా నమ్మరు

అడవిలో మనుషుల్ని పీక్కుతినే రాక్షస జీవి… ఒళ్లు గగుర్పొడిచే హిస్టారికల్ హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో

అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో

Big Stories

Advertisement
×