Biographical Sports Drama: స్పోర్ట్స్ హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ముహమ్మద్ అలీ మాత్రమే. ఆయన కేవలం బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లు విసిరే ఆటగాడు కాదు, రింగ్ వెలుపల సమాజంలో ఉన్న అన్యాయాలపై గొంతు విప్పిన ఒక రియల్ హీరో. ఆ గ్లోబల్ లెజెండ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన అద్భుతమైన బయోపిక్ డ్రామా సిరీస్ ‘The Greatest’. ఈ సిరీస్ లో వచ్చే బాక్సింగ్ మ్యాచెస్, రింగ్ లో అలీ వేసే ఫుట్ వర్క్, అతని పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికే కాకుండా, ఒక మనిషి పోరాట పటిమను చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ మాస్టర్ పీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. మరి దీనిని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ సిరీస్ అలీ జీవితంలోని అత్యంత కీలకమైన నాలుగు సంవత్సరాల కాలం (1960 – 1964) బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన యువ బాక్సర్ కాసియస్ క్లే (ముహమ్మద్ అలీ పాత పేరు) హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ వైపు అడుగులు వేస్తాడు. అయితే ఆ కాలంలో అమెరికాలో ఉన్న జాతి వివక్ష, రాజకీయ అలజడులు అతని ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తాయి. కొత్తగా వచ్చిన స్టార్‌డమ్, ఫ్యామిలీ సమస్యలు, మరోవైపు తన నల్లజాతి ప్రజల హక్కుల కోసం చేసే పోరాటాల మధ్య అలీ ఎలా నిలబడ్డాడు అనేది ఈ కథ. చివరకు 22 ఏళ్ల వయసులో సోనీ లిస్టన్‌ను ఓడించి వరల్డ్ హెవీవెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, సగర్వంగా తన పేరును ‘ముహమ్మద్ అలీ’గా మార్చుకుని చరిత్ర సృష్టించిన క్షణాల వరకు ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన ఇన్స్పిరేషనల్ రైడ్ ఈ సిరీస్.
2026 నవంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా రిలీజైన బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘The Greatest’ వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. కాసియస్ క్లే పాత్రలో జాలెన్ బెస్ట్ (Jaalen Best) ఒదిగిపోయారు. అలీ బాక్సింగ్ స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీని స్క్రీన్‌పై అద్భుతంగా పండించారు. అమెజాన్ MGM స్టూడియోస్, మైఖేల్ బి. జోర్డాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ హై-క్వాలిటీ విజువల్స్, ఎమోషనల్ సీన్స్‌తో సాగుతుంది. బాక్సింగ్ రింగ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ మీలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఇన్‌స్పిరేషనల్ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు మన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
Read Also: కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా