Crime Thriller OTT: బాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మార్క్ రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అద్భుతమైన మేకింగ్ తో వచ్చిన పవర్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా మూవీ ‘నిషాంచీ’ ‘Nishaanchi’. 2025 చివరిలో వచ్చి బిగ్గెస్ట్ ఓటీటీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డార్క్, సస్పెన్స్, అండ్ గ్రిట్టీ ఎలిమెంట్స్‌తో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకే తల్లి కడుపున పుట్టిన కవల సోదరుల కథే ఈ సినిమా. మరి దీని కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే..
నిషాంచీ’ కథ కాన్పూర్ నేపథ్యంలో సాగే ఒక పక్కా రివెంజ్ క్రైమ్ డ్రామా. కథ ఇద్దరు కవల సోదరులైన బబ్లూ, డబ్లూలతో ప్రారంభమవుతుంది. వీరు తమ స్నేహితురాలు రింకూతో కలిసి ఒక బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తారు. కానీ ఆ దోపిడీ ఫెయిల్ అవ్వడంతో బబ్లూ పోలీసులకు దొరికిపోయి పదేళ్లు జైలుకు వెళ్తాడు. డబ్లూ, రింకూ మాత్రం తప్పించుకుంటారు. అయితే ఈ ముగ్గురి వెనుక ఆ ప్రాంతంలో పెద్ద గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడైన అంబికా ప్రసాద్ నీడ ఉంటుంది. గతంలో బబ్లూ, డబ్లూల తండ్రి అయిన ఒక నిజాయితీ గల రెజ్లర్‌ను అంబికా ప్రసాద్ మోసంతో చంపించేస్తాడు. ఆ తర్వాత చాలా తెలివిగా, చిన్న వయసులోనే గురి చూసి కొట్టడంలో కింగ్ (షార్ప్‌షూటర్ – నిషాంచీ) అయిన బబ్లూను తన గ్యాంగ్‌లోకి లాక్కుని వాడుకుంటాడు. అంబికా ప్రసాద్ మాటలు నమ్మి బబ్లూ చేసిన పనుల వల్లే రింకూ తండ్రి కూడా చనిపోతాడు.
బబ్లూ జైల్లో ఉన్న పదేళ్ల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. డబ్లూ, రింకూ ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. అదే సమయంలో తన తండ్రిని చంపింది బబ్లూనే అనే నిజం రింకూకి తెలిసిపోతుంది. మరోవైపు అంబికా ప్రసాద్ కన్ను రింకూకి చెందిన విలువైన భూమిపై పడుతుంది. ఈ గొడవలన్నీ తట్టుకోలేక, కొడుకులు ప్రాణాలతో ఉంటే చాలని వారి తల్లి మంజరి అంబికా ప్రసాద్‌తో రాజీ పడి ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. కానీ పదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలైన బబ్లూ ఎలాగైనా మారిపోయి మంచి జీవితం గడపాలని అనుకుంటాడు. దురదృష్టవశాత్తూ, విలన్ అంబికా ప్రసాద్, ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ కలిసి బబ్లూను మళ్లీ నేరాల ప్రపంచంలోకి లాగుతారు. ఈ క్రమంలో సోదరుల మధ్య కూడా గ్యాంగ్ వార్ మొదలవుతుంది. ఆ తరువాత జరిగే సంఘటనలు ఊహించని ట్విస్ట్లు ఇస్తాయి. ఈ ట్విస్ట్లు ఏమిటి ? అన్న దమ్ముల మధ్య వార్ ఎందుకు మొదలైంది ? అంబికా ప్రసాద్ కుట్రల నుంచి వీళ్ళు బయట పడతారా ? అతని ఉచ్చులో బలైపోతారా ? మంజరి ఈ కథకు ఎలాంటి ముగింపు ఇస్తుంది? అనేది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం, థియేటర్లలో రచ్చ చేసిన తర్వాత ఇప్పుడు Amazon Prime Videoలో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ రా అండ్ గ్రిట్టీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆడియో ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఐశ్వర్య ఠాక్రే డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించగా, మోనికా పన్వర్, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ల యాక్టింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. గ్యాంగ్ స్టర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్.
Read Also : అడవిలో మనుషుల్ని పీక్కుతినే రాక్షస జీవి… ఒళ్లు గగుర్పొడిచే హిస్టారికల్ హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో