E-Paper
Advertisement

‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?

‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?
Advertisement

Mamidi Mounika:దారిపొంటొతుండు…సోషల్ మీడియాని షేక్ చేసిన పాట.ఎంతలా అంటే వచ్చిన ఏడాదిలోనే ఏకంగా 14కోట్ల 20 లక్షల మంది చూసేంత.పిల్లల నుండి పెద్దల వరకు ఈ పాటని హమ్ చేయని వాళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు.ఇక టీనేజ్ గర్ల్స్ ఎందఱో ఈ పాటలకి స్టెప్పులేసి రీల్స్ రూపంలో వదిలిన వారే.

ఇక ఇందులో లీడ్ గా డాన్స్ చేసిన నాగ దుర్గ చార్ట్ బస్టర్ లో టాప్ 3 లో ఇదొకటిగా స్థానం సంపాదించేసింది. ఇక ఈ పాటని రాయడమే కాకుండా తనదైన గొంతుతో అద్భుతంగా ప్రాణం పోసిన మామిడి మౌనిక అన్న సంగతి అందరికి తెల్సిందే.మరింతకీ ఈ మామిడి మౌనిక ఎవరో ,ఎక్కడి నుండి వచ్చిందో, అసలు ఒక్కో పాటకి ఎంత తీసుకుంటుందో ఒకసారి చూసేద్దాం !

Advertisement

జగిత్యాల జిల్లాలోని చిన్నాపూర్ అనే గ్రామంలో

మామిడి మౌనిక పుట్టింది జగిత్యాల జిల్లాలోని చిన్నాపూర్ అనే గ్రామంలో.తండ్రి పని నిమిత్తం గల్ఫ్ పోగా, కుటుంబాన్ని పోషించేందుకు తల్లి బీడీలు చుడుతుండేది.అయితే చిన్నతనంలో తన మామయ్య అయిన కాసర్ల భీమయ్య పాటలు పాడటం చూస్తూ పెరిగిన మామిడి మౌనిక తాను కూడా వాటిని వల్లే వేసేది.అలా చిన్నప్పుడే పాటల్ని ఒంటబట్టించుకున్న మామిడి మౌనిక కాసర్ల భీమయ్య,అలాగే రైటర్ కం సింగర్ అయిన మల్లిక తేజ సహకారంతో ఎనిమిదవ తరగతిలోనే స్టేజ్ పై మొదటిసారిగా ఒక పాటకి కోరస్ పాడింది.అలా పాటలు పాడుతూ,క్రమంగా రాయడం అలవర్చుకున్న మౌనిక ఇప్పటికి ఎన్నో పాటల్ని పాడటమే కాకుండా,రాయడం విశేషం.

Advertisement

69లక్షల వ్యూస్ సొంతం

ముఖ్యంగా ఆమె రాసి,పాడిన మదన సుందరి పాట అప్పట్లో ఒక సెన్సేషన్. దాదాపు ఏడేళ్ళ కిందట వచ్చిన ఈ పాట సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేని రోజుల్లోనే ఓక్ రేంజ్ లో వైరల్ అయ్యింది.అలా ఇప్పటికి ఈ పాట 69లక్షల వ్యూస్ ని సొంతం చేసుకొని ఇప్పటికీ ఫోక్ లవర్స్ ని ఎంతగానో అలరిస్తుంది.ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే మల్లిక్ తేజ మ్యూజిక్, శివ వేల్పుల సినిమాటోగ్రఫీ అందించిన ఈ పాటలో మౌనిక రాయడం ,పాడటమే కాకుండా నటించి మెప్పించడం ఇక్కడ విశేషం.

ఇక సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో వచ్చిన దారిపొంటొతుండు మామిడి మౌనిక అసలు సత్తా ఏంటో చూపించింది.నాగ దుర్గ మెయిన్ లీడ్ గా స్టెప్స్ వేసిన ఈ పాటకి శేఖర్ వైరస్ కోరియోగ్రఫీలో,ఫోక్ మ్యూజిక్ కి కేరాఫ్ గా నిలిచిన మదీన్ యస్.కే సంగీతం అందించగా,మామిడి మౌనికనే లిరిక్స్ రాసి,పాడటం విశేషం.ఇక ఈ పాట వచ్చి రెండేళ్ళు దాటకుండానే ఏకంగా 142 లక్షల మంది ప్రేమని సొంతం చేసుకుందంటే మామిడి మౌనిక కలం,గాత్రం ఎంత మ్యాజిక్ చేశాయో అర్థం అవుతుంది.

ఇప్పటికి 23 లక్షల వ్యూస్

ఇక ఇదే కోవలో మల్లికార్జున రాసిన ఉంగరం అనే పాట కూడా మామిడి మౌనికకి మంచి పేరే తెచ్చింది.కుమ్మరి దుర్గవ్వతో ఆమె కలిసిన పాడిన ఈ పాట ఇప్పటికి 23 లక్షల వ్యూస్ ని కొల్లగొట్టి మరింతగా దూసుకుపోతుంది.ఇక మౌనిక పాడిన నేనొస్తా బావా, నెమలియరాజ, సిత్తరాల మనసు వంటి ఎన్నో పాటలు ఆడియన్స్ ని ,ఫోక్ లవర్స్ ని విపరీతంగా అలరించినవే.

also read:తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

మామిడి మౌనిక అసలు పారితోషికం ఎంత

ఇదిలా ఉండగా ఫోక్ ఇండస్ట్రీని ఈ రేంజ్ లో ఏలుతున్న మామిడి మౌనిక అసలు పారితోషికం ఎంత తీసుకుంటుందా అని ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం మామిడి మౌనిక ఒక్కో పాటకి 30 నుండి 50వేల మధ్యలో తీసుకుంటుంది అన్న టాక్ జోరుగా నడుస్తుంది.అయితే డిమాండ్ ని ,సందర్భాల్ని బట్టి ఈ మొత్తం కాస్త ఎక్కువ తక్కువలుగా ఉండే అవకాశం ఉందని వినిపిస్తుంది.ఏది ఏమైనా ఈ పారితోషికం విషయంలో మౌనిక అసలు విషయం చెబితే కాని క్లారిటీ వచ్చేలా లేదు.చూడాలి తనదైన మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్న మౌనిక ముందు ముందు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

Tags

Related News

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

నా కలలను నాశనం చేశారు.. బిగ్ బాస్ తీరుపై ఝాన్సీ మండిపాటు!

పెళ్లి పీటలెక్కిన దీపికా రంగరాజు.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి తల్లీ?

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?

అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

Big Stories

Advertisement
×