OTT Movie : ఇప్పుడు ఓటిటిలలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. వీటిలో థ్రిల్లర్ సిరీస్ ల ను ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన, ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఐదవ వేదం అని పిలిచే పురాతన గ్రంథం చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. చివరివరకూ సస్పెన్స్ తో ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
జీ 5 (Zee 5)లో
ఈ తమిళ సై ఫై థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఐందం వేదం’ (Aindham Vedham). దీనికి నాగ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో సాయి ధన్షిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజ్‌గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో వై. జి. మహేంద్ర, కృష కురుప్, రామ్‌జీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లతో తెరకెక్కి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అనుతన తల్లి చివరి కర్మలు నిర్వహించడానికి వారణాసికి వెళ్తుంది. అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా, ఒక పరిచయం లేని వ్యక్తి ఆమెకు ఒక పురాతన వస్తువును అప్పగిస్తాడు. దానిని తమిళనాడులోని ఒక పూజారికి అందజేయమని చెప్తాడు. ఈ వస్తువు చాలా కాలం నుంచి కనుమరుగైన, ఐదవ వేదం అని పిలిచే పురాతన గ్రంథం రహస్యాలను వెలికితీసే కీలకమైన వస్తువుగా ఉంటుంది. అను ఆ వస్తువును తీసుకుని ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆతరువాత ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ వస్తువును ఆమె నుండి అడ్డగించాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి. ఈ స్టోరీలో ఒక అరుదైన ఖగోళ సంఘటన, వెయ్యి సంవత్సరాల తర్వాత నాలుగు గ్రహాలు ఒకే దిశలోకి రావడం జరుగుతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఐదవ వేదం రహస్యాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుసుకుంటారు.
అను తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక టెకీ , అయ్యంగారపురం అనే గ్రామంలో కలుస్తారు. వీళ్ళకు కూడా ఇందులో కొన్ని స్టోరీలు ఉంటాయి. ఈ సిరీస్‌లో పౌరాణికతతో పాటు సైన్స్ ఫిక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక అంశాలను కూడా ఇందులో చేర్చారు. ఐదవ వేదం రహస్యాలను వెలికితీసే ప్రయత్నంలో పురాతన జ్ఞానం, ఆధునిక సాంకేతికత ఒకదానితో ఒకటి పోటీపడుతాయి. అను ఎదుర్కొనే ప్రమాదాలు, ఆమె ప్రయాణంలో వెల్లడయ్యే ట్విస్ట్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరిలో ఒక సస్పెన్స్‌ఫుల్ క్లైమాక్స్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది. మీరు కూడా ‘ఐందం వేదం'(Aindham Vedham) అనే ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూడాలి అనుకుంటే, జీ 5 (Zee 5) లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం ఈ వెబ్ సిరీస్ పై ఓ లుక్ వేయండి.