 
					OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే సీరియల్ కిల్లర్ సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ఆడియన్స్. ఎవాన్ పీటర్స్ (జెఫ్రీ డామర్) అనే సీరియల్ కిల్లర్ జీవితం ఆధారంగా ఒక సిరీస్ తెరకెక్కింది. 1978 నుండి 1991 వరకు 17 మందిని హత్య చేసిన ఘటనలు అప్పట్లో సంచలనం అయింది. అయితే పోలీసు వైఫల్యం ఈ సినిమాలో ప్రధానంగా కనబడుతుంది. ఈ సిరీస్ ఓటీటీలో టాప్ వ్యూస్ తో నడుస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుడుకుందాం పదండి.
‘మాంస్టర్’ (Monster) 2022లో విడుదలైన అమెరికన్ ట్రూ క్రైమ్ హారర్ డ్రామా మినీ సిరీస్. ఇది రయన్ మర్ఫీ, ఇయాన్ బ్రెన్నన్ దర్శకత్వంలో రూపొందింది. ఇది మాంస్టర్ అంథాలజీ సిరీస్‌లో మొదటి సీజన్. 10 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్, సిస్టమిక్ ఫెయిల్యూర్‌లు గురించి చూపిస్తుంది. ఇది 2022 సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.
జెఫ్రీ డామర్ చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉంటాడు. తల్లి-తండ్రి గొడవలు, మద్యం అలవాటు వల్ల మనసు చెడిపోతుంది. దీంతో అతను నేరాల బాట పడతాడు. 1978లో మొదటి హత్య చేస్తాడు. ఒక యువతిని కారులో ఎక్కించి, మందు ఇచ్చి చంపి, శరీరాన్ని ముక్కలు చేసి పాతిపెడతాడు. ఆ తర్వాత కాలేజీ వదిలేసి, ఒక చిన్న ఫ్లాట్‌లో ఉంటాడు. బార్‌లలో పరిచయం చేసుకుని, ఇంటికి తీసుకువచ్చి మందు కలిపి నిద్రపోయేలా చేసి, హత్యలు చేస్తాడు. శరీరాలను ఫ్రిజ్‌లో దాచుకుంటాడు, కొన్ని భాగాలు తింటాడు కూడా. ఒక రోజు డామర్ ఇంట్లో నుంచి దుర్వాసన గురించి, పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ పోలీసులు సరిగ్గా చూడరు. డామర్ తెల్లవాడు కాబట్టి సీరియస్‌గా తీసుకోరు.
Read Also : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా