OTT Movie : క్రైమ్ స్టోరీలు ఎక్కువగా మర్డర్ చుట్టూ తిరుగుతుంటాయి. అయితే మలయాళం క్రైమ్ స్టోరీలు డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. వాళ్లు సినిమాలు తీసే పద్ధతులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేసే తీరు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. చివరివరకు మిమ్మల్ని కుర్చీలకే కట్టిపడేస్తుంది ఈ మలయాళం మూవీ. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ పేరు ‘అంచక్కల్లకొక్కన్’ (Anchakkallakokkan). 2024 లో విడుదలైన ఈ మలయాళ మూవీకి ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లుక్‌మాన్ అవరాన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్. అచారి, మేఘా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ 1986 లో కేరళ కర్ణాటక సరిహద్దులోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
చాప్రా అనే ఒక భూస్వామి హత్యతో స్టోరీ మొదలవుతుంది. ఈ హత్య స్థానిక ఎన్నికల రోజున జరుగుతుంది. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొంటుంది. ఈ హత్యను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఇదే సమయంలో వాసుదేవన్ అనే కొత్త పోలీస్ కానిస్టేబుల్, కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. అతను భయంతో కూడిన వ్యక్తి గా ఉంటాడు. రక్తం చూస్తే కూడా స్పృహ కోల్పోతాడు. హింసను ఎదుర్కోవడానికి దూరంగా ఉంటాడు. అతని గతంలోని కొన్ని సంఘటనలు ఈ భయానికి కారణంగా ఉంటాయి. అయితే నాడా అనే ఇంకో పోలీస్, వాసుదేవన్ ఈ కేసును ఎంక్వైరీ చేస్తారు. ఇంతలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అయితే అతను చాప్రా ను చంపి ఉండడు. అతని కూతుర్ని ఒక పోలీస్ పాడుచేసి చంపుతాడు. అతని పై పగతీర్చుకోవాలని అనుకుంటాడు. ఆతరువాత చాప్రా కి ఆ ఇంట్లో ఉండే పనిమానిషితో కూడా అక్రమ సంబంధం ఉంటుంది.
పనిమనిషి తో పాటు మరికొంత మంది సన్నిహితులను కూడా అనుమానిస్తారు. చాప్రా కుటుంబంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల పై అనుమానాలు వస్తాయి. వాసుదేవన్ తన భయాలను అధిగమించి, ఈ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో అతను కొన్ని సవాళ్లను ఎదుర్కొంటాడు. ఆతరువాత, ఈ హత్య వెనుక ఒక ప్రతీకార కోణం ఉందని తెలుస్తుంది. ఇంతలో పనిమనిషి, నాడా పాత్రపై కూడా అనుమానాలు వస్తాయి. చివరికి ఈ హత్య వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ? వాసుదేవన్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? గ్రామంలో ఉండే అతని శత్రువుల పాత్ర ఎంత ? అమ్మాయిని పాడు చేసి చంపిన పోలీస్ ఎవరు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను చూడండి.