IREL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. సీఏ, సీఎంఏ, ఎంబీఏ, బీకాం, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) ముంబయి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేస్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉండనుంది.
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 30
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, రాజ్‌భాష, బిజినెస్ డెవలప్‌మెంట్ & మార్కెటింగ్, సివిల్, టెక్నికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
జనరల్ మేనేజర్(ఫైనాన్స్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్): 01
చీఫ్ మేనేజర్(ఫైనాన్స్): 01
సీనియర్ మేనేజర్(ఫైనాన్స్): 01
అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్): 02
డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం): 01
చీఫ్ మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం): 01
అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం): 02
అసిస్టెంట్ మేనేజర్(రాజ్‌భాష): 02
డిప్యూటీ జనరల్ మేనేజర్(బిజినెస్ డెవలప్‌మెంట్ ): 01
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 02
చీఫ్ మేనేజర్(సివిల్): 01
మేనేజర్(సివిల్): 03
డిప్యూటీ మేనేజర్(సివిల్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్(టెక్నికల్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్(కమర్షియల్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్( ప్రాజెక్ట్స్): 01
చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్): 01
చీఫ్ మేనేజర్(కమర్షియల్): 01
మేనేజర్(ఎలక్ట్రికల్): 03
మేనేజర్(మెకానికల్): 01
డిప్యూటీ మేనేజర్(మినరల్): 01
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 10
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో సీఏ, సీఎంఏ, ఎంబీఏ, బీకాం, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్స్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 46 ఏళ్లు, చీఫ్ మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 28 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ.2,60,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000, చీఫ్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, సీనియర్ మేనేజర్‌కు రూ.70,000 – రూ.2,00,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 – రూ.1,40,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://irel.co.in/careers
ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!