BigTV English

OTT Movie : నాన్ వెజ్ కోసం భర్తనే వదిలేయడానికి సిద్ధమయ్యే భార్య… క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు మావా

OTT Movie : నాన్ వెజ్ కోసం భర్తనే వదిలేయడానికి సిద్ధమయ్యే భార్య… క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు మావా

OTT Movie  : హైదరాబాద్‌లోని నాలుగు వేర్వేరు వ్యక్తుల జీవితాలతో ఈ సిరీస్ మొదలవుతుంది.  ఒకరికి స్థానిక నాయకుడి చేతిలో అవమానం, మరొకరికి తన ఆహార ఇష్టాలను భర్త నిషేధిచటం, ఇంకొకరు నిద్ర కోసం తపిస్తూ ఇంటి యజమాతో గోడవకు దిగటం, చివరగా ఒక యువకుడు తన బట్టతలతో అవమానాలను పడటం, వీటి వల్ల  సహనం నశించి వీళ్ళంతా తిరుగుబాటు ధోరణి మొదలుపెడతారు. ఇక ఈ నలుగురి సమస్యలకు తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదా? ఈ నాలుగు కథలు వారి జీవితాలను ఎలా మారుస్తాయి ?  ఈ సిరీస్ పేరు ,ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ నాలుగు ఇండిపెండెంట్ కథలతో కూడిన యాంథాలజీ వెబ్ సిరీస్. ఒక్కో కథ ఒక్కో వ్యక్తి జీవితంలో తిరుగుబాటు స్వభావం చూపిస్తుంది. సామాజిక ఒత్తిళ్లు, వ్యక్తిగత అవమానాలు, రోజువారీ సమస్యలు వీరిని ఎలా నడిపిస్తాయనేది థీమ్.


1. బెనిఫిట్ షో (రంగా, వెంకటేష్ మహ): రంగా ఒక సినీ స్టార్ కు డై-హార్డ్ ఫ్యాన్. తన హీరో సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను 7 PMకి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఏర్పాటు చేస్తాడు. కానీ స్థానిక నాయకుడు స్రీను (సుహాస్) 200 టిక్కెట్లు కొని తన అధికారం చూపించడంతో, టిక్కెట్ సేల్స్‌లో గందరగోళం, రంగా గౌరవానికి భంగం కలుగుతాయి. ఆ తరువాత అతను తన గౌరవాన్ని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఈ కథ. ఈ ఎపిసోడ్ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్‌పై థ్రిల్లింగ్ కామెంటరీ ఇస్తుంది.

2. ఫుడ్ ఫెస్టివల్ (పూజా రెడ్డి, మడోన్నా సెబాస్టియన్): పూజా ఒక నాన్-వెజిటేరియన్. తను గర్భవతి అయినప్పుడు తన భర్త రాజీవ్ (థరుణ్ భాస్కర్), అతని కుటుంబం ఆమె ఆహార ఇష్టాలను నిషేధించడంతో, ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. డాక్టర్ నాన్-వెజ్ తినమని సలహా ఇస్తాడు. అందుకు ఈ కుటుంబం నిరాకరిస్తుంది. పూజా కోపంతో వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తుంది. ఆమె స్వేచ్ఛను ఎలా సాధిస్తుందనేది ఈ కథ.

3. ఆన్ అఫ్టర్‌నూన్ న్యాప్ (రాధా, బిందు మాధవి): రాధ ఒక మిడిల్-క్లాస్ గృహిణి. నిస్సహాయత కలిగిన ఇంట్లో భర్త (రవీంద్ర విజయ్)తో నివసిస్తూ, తీవ్రమైన మైగ్రేన్‌తో బాధపడుతుంటుంది. ఆమె నిద్రను ఇంటి యజమాని, వారి బంధువుల గట్టిగా మాట్లాడే పద్దతి భంగం చేస్తాయి. రాధా శాంతి కోసం తపిస్తూ, ఆమె ఒక అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. ఈ ఎపిసోడ్ గృహిణుల సమస్యలను సానుభూతితో చూపిస్తుంది. కానీ క్లైమాక్స్ కొంత వివాదాస్పదంగా ఉంటుంది.

4. హెల్మెట్ హెడ్ (గిరిధర్, ఫణి ఆచార్య): గిరిధర్ 32 ఏళ్ల బట్టతల యువకుడు. నిరుద్యోగం, బట్టతల వల్ల అవమానాలు ఎదుర్కొంటాడు. తన సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో కోపంలో ఉంటాడు. అతని జీవితం ఎలా మారుతుందనేది ఈ కథ. ఈ ఎపిసోడ్ యువత సెల్ఫ్-ఎస్టీమ్ సమస్యలపై రిలేటబుల్‌గా ఉంటుంది.

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సిరీస్ పేరు ‘ఆంగర్ టేల్స్’ ( Anger Tales). 2023 లో వచ్చిన ఈ సిరీస్ ప్రభాల తిలక్ దర్శకత్వం వహించారు. నాలుగు ఎపిసోడ్స్ తో, జియో హాట్‌ స్టార్ (Jio Hotstar) లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో వెంకటేష్ మహ, సుహాస్, మడోన్నా సెబాస్టియన్,థరుణ్ భాస్కర్,బిందు మాధవి,రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also : భర్తను వదిలేసి వేరే అమ్మాయితో… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే బుర్ర కరాబ్

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×