AP Mega DSC Exams 2025: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ లపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 17 నుంచి స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తోంది ఏపీ విద్యాశాఖ. అన్ని పోస్టులకు కలిసి దాదాపుగా 5 లక్షల 77 వేలకు పైగానే దరఖాస్తు అందాయి. అందులో పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.
పరీక్షలు పూర్తయి తర్వాత సబ్జెక్టుల వారీగా హాజరైన అభ్యర్థుల వివరాలు తెలియనుంది. ప్రస్తుతం ఏపీలో డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీటిలో పలు పరీక్షలు ముగియగా, జూన్ 30 నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసిన తర్వాత వీటిపై అభ్యంతరాలను స్వీకరించనుంది విద్యాశాఖ.
జూన్ 17 (మంగళవారం) స్కూల్ అసిస్టెంట్లు కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షల కీ విడుదల చేయనుంది. వాటిపై జూన్ 23లోగా అభ్యంతరాలను స్వీకరించనుంది. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ప్రాథమిక కీలను తెలుసుకోవచ్చు. అభ్యంతరాలను ఆ వెబ్ పోర్టల్‌లో పంపవచ్చు. మిగతా పేపర్ల ప్రాథమిక కీ లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ALSO READ: తల్లికి వందనం వర్సెస్ అమ్మ ఒడి, ఏది బెటర్?
మెగా డీఎస్సీలో భాగంగా సోమవారం స్కూల్ అసిస్టెంట్(నాన్ లాంగ్వేజ్)సోషల్ పరీక్షకు 38 వేల పైచిలుకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 36 వేల మంది హాజరయ్యారు. 227 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు అనంతపురం జిల్లాలో 97 శాతం, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో దాదాపుగా 98 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ విషయాన్ని డీఎస్సీ–2025 కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇక స్కూల్ అసిస్టెంట్ ముఖ్యంగా లాంగ్వేజెస్‌లో కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక కీ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో రెస్పాన్స్ షీట్ అభ్యర్థులు ఆయా కీలను పరిశీలించవచ్చు.