OTT Movie : కేరళలో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మహిళల జీవితాల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, గౌరవం, విలువల కోసం పోరాడుతుంటారు. మగవాళ్ళ ఆధిపత్యం వీళ్ళ కలలు, ఆశలకు అడ్డంకిగా నిలుస్తాయి. ఒక యువతి సమాజంలోని మహిళల అణచివేత గురించి ప్రశ్నిస్తుంది. మరొకరు తన జీవిత ఆశయాలను త్యాగం చేసిన రిటైర్డ్ మహిళగా కనిపిస్తుంది. ఇంకో మహిళ లెస్బియన్ సంబంధంలో మోసపోయి, బాడీ షేమింగ్‌ను ఎదుర్కుంటుంది. ఇలా ఒక్కో మహిళ లైఫ్ చుట్టూ, ఒక డిఫరెంట్ స్టోరీ నడుస్తుంది. ఈ మహిళలు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తారు? ఈ మహిళల పోరాటం వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
‘సోల్ స్టోరీస్’ ఐదు ఎపిసోడ్‌లతో వచ్చిన మలయాళం వెబ్ సిరీస్. ఇది విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక విభిన్నమైన కథను చూపిస్తూ , సమాజంలోని గౌరవం, స్వేచ్ఛ వంటి థీమ్స్‌పై దృష్టి పెడుతుంది.
ఎపిసోడ్ 1: Kiss of Kochi: ఇది కొచ్చిలోని ఆధునిక మెట్రో జీవితంలో సెట్ చేయబడిన కథ. ఒక యువతి (అనర్కలి మరికర్) సమాజంలో ఎదుర్కునే సమస్యలతో ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ఇందులో అనర్కలి, షాలు రహీం పెర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి.
ఎపిసోడ్ 2: Rani: ఈ కథ ఒక రిటైర్డ్ మహిళ (సుహాసిని మణిరత్నం) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన జీవిత ఆశయాలను తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, మనవళ్ల కోసం త్యాగం చేస్తుంది. ఆమె తన కలలను తిరిగి నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వయసు ఆశయాలకు అడ్డంకి కాదని నిరూపిస్తుంది. సుహాసిని నటన హృదయాన్ని హత్తుకుంటుంది.
ఎపిసోడ్ 3: Simhathinde Madiyil: ఈ ఎపిసోడ్ ఒక కుటుంబంలోని ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో రెంజి పనికర్, ఆశా అరవింద్, సజీవ్ సోమన్ నటనలు ఆకట్టుకుంటాయి.
ఎపిసోడ్ 4: Neeril Veezhum Pookkal: లెస్బియన్ సంబంధంలో, మోసపోయిన ఒక మహిళ (గోపిక మంజుష) కథను ఈ ఎపిసోడ్ చూపిస్తుంది. ఒకరి కోసం మరొకరిని విడిచిపెట్టడం, ఎమోషన్స్ తో ద్రోహం చేయడం వంటి సీన్స్ ఆలోచింపజేస్తాయి. దయ్యానా హమీద్, గోపిక పెర్ఫార్మెన్స్‌లు ఇందులో ఆకట్టుకుంటాయి.
ఎపిసోడ్ 5: Brarthamanam: ఈ కథ ఆధునిక డ్రెస్సింగ్ స్టైల్స్, యువతులపై సమాజం విధించే స్టిగ్మాపై దృష్టి పెడుతుంది. ఒక తల్లి తన కూతురు డ్రెస్సింగ్ గురించి వచ్చిన వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తుంది, బాడీ షేమింగ్‌ను ఎలా ఎదుర్కొంటుంది అనేది ఈ ఎపిసోడ్ లో చూడవచ్చు. ఈ సిరీస్ సమాజంలోని మహిళల సమస్యలను , విజయాలను, ఓటముల ప్రయాణాన్ని రిలేటబుల్‌గా చిత్రీకరిస్తుంది. ఇది డ్రామాటిక్ కంటే ఎమోషనల్, రియలిస్టిక్ టోన్‌ను కలిగి ఉంటుంది.
Read Also : ఉగ్రవాదులను మట్టుబెట్టే రియల్ స్టోరీ.. మతిపోగొట్టే ట్విస్టులు.. యాక్షన్ సీన్స్ తో ఊహించని క్లైమాక్స్
ఈ మలయాళం వెబ్ సిరీస్ పేరు ‘సోల్ స్టోరీస్’ (Soul Stories). 2024 అక్టోబర్ 18 న వచ్చిన ఈ సిరీస్ కు సనిల్ కలతిల్ దర్శకత్వం వహించారు. మనోరమ మాక్స్ దీనిని నిర్మించింది. ఇందులో అనర్కలి మరికర్, సుహాసిని మణిరత్నం,రెంజి పనికర్,గోపిక మంజుష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ManoramaMax లో స్ట్రీమింగ్ అవుతోంది.