OTT Movie : ఎన్నో యుద్ధాలు, మరెన్నో జీవితాలతో చరిత్ర నిండిపోయింది. వీటి గురించి చెప్పుకుంటూ పోతే సమయం కూడా సరిపోదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ 1947లో జరగబోయేదిగా ఉంటుంది. స్వతంత్రం వచ్చినా, బ్రిటిష్ పరిపాలన సాగుతూనే ఉండే విధంగా చట్టాలు చేసి ఉంటారు తెల్ల దొరలు. అలా ఒక గ్రామంలోని ప్రజలు, దొరల చేతిలో ఎలా ఇబ్బందులు పడ్డారో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
2023 లో విడుదలైన ఈ తమిళ్ మూవీ పేరు ‘ఆగష్టు 16 1947‘ (August 16 1947). ఈ మూవీకిఎన్.ఎస్. పొన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో గౌతమ్ కార్తీక్, జాసన్ షా, పుగాజ్, జూనియర్ ఎంజీఆర్, రిచర్డ్ ఆష్టన్, రేవతి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 7 ఏప్రిల్ 2023న విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక కూడా, బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపద కోసం ఇంకా పడి చచ్చేవాళ్ళు. ఇంకా సంపద దోచుకోవడానికి ఒక కొత్త చట్టం తెస్తారు. అందులో ఒక గ్రామంలో పత్తి బాగా పండుతుందని తెలిసి, 30 సంవత్సరాలు ఆ గ్రామాన్ని లీజుకు తీసుకుంటారు. అలా అక్కడ ఉన్న రాబర్ట్ అనే అధికారికి ఆదేశాలు కూడా పంపుతారు. నిజానికి రాబర్ట్ జలియన్ వాలాబాగ్ లో కాల్పులు జరపమని జనరల్ డయ్యర్ కి సలహా ఇచ్చి ఉంటాడు. చాలా క్రూరమైన వాడు రాబర్ట్. ఇతని కొడుకు జస్టిన్ ఆ గ్రామంలో అమ్మాయిలను చాలా దారుణంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఊరు జమిందార్ కూడా తన కూతురు చనిపోయిందని దినకర్మ కూడా చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ అమ్మాయి బతికే ఉంటుంది. వాడి బారి నుంచి తప్పించుకోవడానికి అలా చనిపోయినట్టు చెప్తుంటాడు జమీందారు. జస్టిన్ ఎంత దుర్మార్గుడు అంటే దేవుడు విగ్రహాన్ని కూడా మరోలా చూసే నీచుడు. పరమల్ అనే వ్యక్తి మాత్రమే జమీందారు కూతురు బతికే ఉందని తెలుసుకుంటాడు.
నిజానికి పరమల్ జమీందారు కూతుర్ని ప్రేమిస్తుంటాడు. ఒకసారి జస్టిన్, జమీందారి కూతురు బతికే ఉందని తెలుసుకుంటాడు. ఆమెను తన దగ్గరికి పంపించాలని జమీందారికి చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్లు ఎలాగూ వదలరని జమీందారు కూతుర్ని చంపాలనుకుంటాడు. బతికుండగానే ఒక గొయ్యి తీసి అందులో సమాధి చేస్తారు. ఇదంతా గమనిస్తున్న పరమల్ ఆమెను కాపాడి జస్టిన్ ఇంట్లోనే దాచిపెడతాడు. చివరికి జమిందారి కూతురు జస్టిన్ కి దొరుకుతుందా? పరమల్ ప్రేమ విషయం ఆమెకు తెలుస్తుందా? బ్రిటీష్ దొరలను వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆగష్టు 16 1947’ (August 16 1947) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి.