OTT Movie : మనుషుల జీవితాలు ఎప్పుడు ఎటు మారిపోతాయో ఎవరికీ అర్థం కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాలలో చూస్తూ ఉంటారు. అలాగే సినిమాలలో జరిగే సంఘటనలు, నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒక యువకుడు, ఒక మహిళ మోజులో పడి తన జీవితాన్ని తలక్రిందులయ్యేలా చేసుకుంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో సినిమా (jio cinema) లో
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు బి.ఏ పాస్ (B.A. Pass). ఈ మూవీని నరేంద్ర సింగ్ నిర్మించగా, అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఇందులో శిల్పా శుక్లా, షాదాబ్ కమల్, రాజేష్ శర్మ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీకి రెండు సీక్వెల్‌లు విడుదలయ్యాయి. అవి షాదాబ్ ఖాన్ దర్శకత్వం వహించిన బి.ఎ. పాస్ 2, నరేంద్ర సింగ్ దర్శకత్వం వహించిన బి.ఎ. పాస్ 3. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (jio cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఒక ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోతారు. వీళ్లకు ముఖేష్ అనే కొడుకుతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా ఉంటారు. బంధువులు ఎవరికి వాళ్లు బాధ్యత తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇదంతా గమనించిన ముఖేష్ తాత, తనకు వచ్చే పెన్షన్తో మిమ్మల్ని పోషిస్తానని చెప్తాడు. అయితే ముఖేష్ చదువు మధ్యలోనే ఆగిపోకూడదని, చదువు అయ్యేంతవరకు తన అత్తయ్య దగ్గర చదువుకోమని చెప్తాడు. అందుకు కూడా తాతయ్య డబ్బులు ఇస్తానని చెప్తాడు. ఆడపిల్లల్ని తనదగ్గరే ఉంచుకుంటాడు తాత. అలా ముఖేష్ తన అత్త దగ్గర చదువుకోవడానికి వెళ్తాడు. అయితే ముఖేష్ ని వాళ్ళందరూ చాలా చులకనగా చూస్తుంటారు. ఈ క్రమంలో ముఖేష్ కి తన అత్త ఫ్రెండ్ అయిన రేవతి పరిచయం అవుతుంది. అతని మీద మనసుపడి బలవంతంగా అతన్ని ముగ్గులోకి దింపుతుంది. భర్త లేని సమయం చూసి తనతో ఏకాంతంగా గడుపుతుంది. మరోవైపు తాత చనిపోవడంతో, చెల్లెల్ని హాస్టల్లో వేస్తాడు ముఖేష్. డబ్బులు బాగా అవసరం అవడంతో రేవతిని సహాయం అడుగుతాడు. అప్పుడు రేవతి మరొక మహిళ దగ్గరికి వెళ్లి గడపమని చెప్తుంది.
అలా గడిపితే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారని, నీతో పాటు నేను కూడా డబ్బులను సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. ఇష్టం లేకపోయినా ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు ముఖేష్. ఈ క్రమంలో ఆంటీలతో ఆ పని చేసుకుంటూ డబ్బులు బాగానే సంపాదిస్తాడు. ఆ డబ్బులను తిరిగి రేవతి దగ్గరే పెడతాడు. ఒకరోజు ముఖేష్ తో రేవతి క్లోజ్ గా ఉండడం చూసి, రేవతి భర్త తనని కొడతాడు. అక్కడినుంచి పారిపోయిన ముఖేష్, తనకు పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర తలదాచుకుంటాడు. మరోవైపు చెల్లెళ్లకి హాస్టల్ ఫీజ్ కట్టాల్సి వస్తుంది. మరుసటి రోజు తన డబ్బులు ఇవ్వాలని రేవతిని అడుగుతాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు అంటూ రేవతి ఎదురు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆమెను కత్తితో పొడిచి చంపేస్తాడు ముఖేష్. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చివరికి ముఖేష్ ఆత్మహత్య చేసుకుంటాడా? అతని చెల్లెళ్ల పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.