పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పెద్దలు చెప్తుంటారు. వారు ఏ పని చేస్తున్నా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే, వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. ఆడుకుంటూ.. ఏవేవో వస్తువులు మింగి కొందరు, నీటి సంఫుల్లో పడి మరికొంత మంది, నోట్లో ఛార్జింగ్ వైర్ పెట్టుకుని ఇంకొంత మంది, బిల్డింగ్ మీది నుంచి కింద పడి కొందరు చనిపోయిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా.. ఇలాంటి విషాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
వెంటిలేషన్ గుంతలో పడి చిన్నారి మృతి
తాజాగా కొంతమంది పిల్లలు ఓ అపార్ట్ మెంట్ మీదికి ఎక్కారు. చాలా సేపు ఆటలాడుకున్నారు. తల్లిదండ్రులు సైతం ఆడుకుంటున్నారు కదా అని లైట్ తీసుకున్నారు. పిల్లలంతా కలిసి అపార్ట్ మెంట్ మీద ఉన్న నిచ్చెన ఎక్కారు. పైన ఉన్న చిన్న టెర్రస్ మీదికి వెళ్లారు. అక్కడ ఉన్న వెంటిలేషన్ గుంతపై ఏర్పాటు చేసిన ఐరన్ రేకు పైకి ఎక్కి దూకడం మొదలు పెట్టారు. కాసేపు అలాగే దూకుతూ ఆడుకున్నారు. అందులో ఓ పాప కూడా అలాగే పైకి ఎక్కి దూకింది. అమ్మాయి కాస్త అంచున దూకడంతో ప్లాస్టిక్ రేక్ వంగిపోయింది. చిన్నారి అమాంతం ఐదు అంతస్తులు కిందపడిపోయింది. చిన్నారి వేగంగా కింద పడటంతో తీవ్రగాయాల పాలయ్యింది. స్పాట్ లోనే చనిపోయింది. ఆ చిన్నారి తాతయ్య ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకవేళ మీ అపార్ట్ మెంట్ లో ఇలాగే లిఫ్ట్ పై భాగంలో ప్లాసిక్ రేకు ఏర్పాటు చేసి ఉంటే, ఐరన్ గ్రిల్స్ పెట్టించుకోవాలని సూచించారు. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? అనే విషయాన్ని తరచుగా గమనించాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: 13వ అంతస్తు నుంచి జారిపడ్డ చిన్నారి, అతడే లేకపోతే..
అపార్ట్మెంట్ వాసులు అందరూ దయచేసి చూడండి..మీ కమిటీ తో చర్చించుకుని ఇలాంటివి ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోండి 🙏 pic.twitter.com/mg5Fg5SOk7
— Swathi Reddy (@Swathireddytdp) January 29, 2025
Read Also: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు, ముక్కలు ముక్కలైన యువతి!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు బాధ పడుతున్నారు. అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అపార్ట్ మెంట్ నిర్మించే సమయంలో పిల్లలకు ప్రమాదం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లిఫ్ట్ పై భాగంలో పిల్లలు దూకినా విరిగిపోని ఇనుపరాడ్లతో గ్రిల్ ఏర్పాటు చేయించాలంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ రేక్ లు మీ అపార్ట్ మెంట్లలో కూడా ఉంటే వెంటనే మార్పించుకోవాలని సూచిస్తున్నారు. దయ చేసి పిల్లలను ఒంటరిగా వదిలే ప్రయత్నం చేయకూడదంటున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినప్పటికీ, ఎక్కడ అనేది కచ్చితంగా తెలియదు.
Read Also: దూసుకొస్తున్న రైలు, సడెన్ పట్టాల మీద పడిపోయిన యువతి, సీన్ కట్ చేస్తే…