OTT Movie : హిస్టారికల్ సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు ఇటువంటి సన్నివేశాలకు మన ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు. బాహుబలి సినిమా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి కుటుంబ నేపథ్యంలో సాగే ఒక హిస్టారికల్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ చైనీస్ హిస్టారికల్ మూవీ పేరు ‘కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్‘ (Curse of the golden flower). ఈ మూవీకి జాంగ్ యిమౌ దర్శకత్వం వహించారు. 45 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన చైనీస్ చిత్రంగా రికార్డ్ తిరగరాసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చైనా దేశంలో ఒక ప్రాంతాన్ని టాంగ్ అనే మహారాజు పాలిస్తుంటాడు. యుద్ధం ముగించుకొని రాజ్యానికి వస్తున్న మహారాజుని ఆహ్వానిస్తూ గొప్పగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ఆ రాజ్యం లోని ప్రజలు. అయితే రాణికి, రాజు మొదటి భార్య కొడుకు వాన్ కి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది. రాజు మొదటి భార్య రాజ్యం నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడున్న మహారాణికి ఇద్దరు కొడుకులు ఉంటారు. మొదటి భార్య కొడుకు వాన్ తో సంబంధం ఉన్నట్టు రాజుకు కూడా తెలుస్తుంది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించే విధంగా ఒక ఔషధం ఇస్తూ ఉంటాడు మహారాజు. మహారాణి పెద్ద కొడుకు జై యుద్ధ రంగంలో మంచి నైపుణ్యం సాధిస్తాడు. వాన్ రాజ్యంలో పనిచేసే వైద్యుని కూతురిని ప్రేమిస్తుంటాడు. ఇతనికి రాజ్యం మీద కాంక్ష తక్కువగా ఉంటుంది. ప్రేమించిన అమ్మాయితో స్వేచ్ఛగా బయటికి వెళ్లి బ్రతకాలనుకుంటాడు. మరోవైపు తన కొడుకు జైతో తండ్రికి వ్యతిరేకంగా పోరాడమని చెప్తుంది మహారాణి.
ఇంతలోనే వాన్ తాను ప్రేమిస్తుంది తన చెల్లెలని తెలుసుకుని చాలా బాధపడతాడు. వీళ్ళందర్నీ మహారాజు సైన్యం చంపేస్తుంది. చివరికి తన తల్లితో సంబంధం పెట్టుకున్న వాన్ ని, మహారాణి చిన్న కొడుకు చంపేస్తాడు. మహారాణి కొడుకు జై తండ్రి పై యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ యుద్ధంలో మహారాజుదే పై చేయిగా నిలుస్తుంది. ఆ తర్వాత మహారాణికి కొడుకు ద్వారానే విషం ఇవ్వాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు టాంగ్. ఆ పని చేయలేక యువరాజు గొంతు కోసుకుని చనిపోతాడు. చివరికి మహారాజు, రాణిని శిక్షిస్తాడా? ఆ రాజ్యానికి తర్వాత రాజు అయ్యే అర్హత ఎవరికి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్’ (Curse of the golden flower) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.