Ram Charan In Unstoppable : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీ జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను ఓ రేంజులో మొదలు పెట్టారు మేకర్స్. ఇక రామ్ చరణ్ కూడా పలు షోలకు హాజరవుతూ సినిమాను తన స్టైల్లో ప్రమోషన్ చేస్తూ వస్తున్నాడు. గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడానికి కేవలం ఒక్కరోజే ఉంది.. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ లో రామ్ చరణ్ సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. బాలయ్య చరణ్ ను అడ్డంగా ఇరికించాడు.. బాలయ్య సీరియస్ అయ్యాడు. అసలు ఎందుకు బాలయ్య ఆడియన్స్ పై సీరియస్ అయ్యాడో తెలుసుకుందాం..
అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్..
గేమ్ ఛేంజర్ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ మొన్న హిందీ బిగ్ బాస్ లో సందడి చేశారు. నిన్న బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లోను సందడి చేశాడు. బాలయ్యతో కలిసి సరదాగా చెందేసిన చరణ్‌ను బాలయ్య తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ గురించి చెబుతూ చరణ్ ఎమోషనల్ అయ్యారు.. అలాగే మూవీ గురించి ఎన్నో విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. ఇక బాలయ్య షోలో అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సెలెబ్రేటిలని ఇరికించి సమాధానం చెప్పిస్తాడు. ఈ షో జనవరి 8 న స్ట్రీమింగ్ కు వచ్చింది. రామ్ చరణ్ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్య అడిగే ప్రతి ప్రశ్నకు సమయ స్ఫూర్తితో సమాధానం చెప్పాడు.. ఇక మహేష్ బాబుతో ఫ్యూచర్లో సినిమా తీసే అవకాశం ఉందని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఆడియన్స్ పై బాలయ్య సీరియస్..
బాలయ్య షోలో రాపిడ్ ఫైర్ మాములుగా ఉండదు.. సెలెబ్రేటిలకు ఆలోచించే సమయం ఇవ్వడు.. ఒకటి చెబితే మరొక దానికి మెలిక పెట్టేస్తాడు. మొత్తానికి అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. రామ్ చరణ్ ను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ ను ఉపాసన గురించి అడిగాడు. అలాగే ఫ్యామిలీ గురించి అడుగుతాడు. ఇక మల్టీ స్టారర్ స్టోరీ ఒకటి నా దగ్గర ఉంది. అయితే ప్రభాస్, మహేష్ బాబు నువ్వు ఎవరితో చేస్తావని అడిగితే దానికి ఆలోచిస్తాడు చరణ్.. అంత సమయం ఎందుకు నువ్వు చెప్పు ఏ హీరోతో చేస్తావని అడుగుతుంది. మహేష్ పెద్ద వారు ప్రభాస్ ఏమనుకోడు అర్థం చేసుకుంటాడు. దానికి బాలయ్య మెలిక పెట్టేస్తాడు.. ఇక ఆడియన్స్ కూడా ఏదో అనడంతో ఆ ఒక్కటి అడగొద్దు గేమ్ ఆపేసి వచ్చి మీ సంగతి చూస్తా అని సీరియస్ అవుతాడు. అది ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచింది. ఇక ఎలాంటి విషయాలను షేర్ చేసుకున్నాడో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మూవీలో సంక్రాంతి రేసులో ఉన్నాయి. మరి ఏ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందో చూడాలి..