OTT Movie : ఫాంటసీ సినిమాలు ప్రేక్షకుల్ని మరోలోకంలోకి తీసుకెళ్తాయి. అందులోనూ హాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు పెద్దలతో సహా పిల్లల్ని కూడా బాగా అలరిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో ఒక డెవిల్ తో ఒప్పందం చేసుకుంటాడు. ఆ డెవిల్ అతనికి ఏడు కోరికలను తీరుస్తుంది. దానికి బదులుగా అతని ఆత్మని డెవిల్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూవీ చివరివరకూ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘బెడాజ్ల్డ్'(Bedazzled). ఈ ఫాంటసీ మూవీకి హెరాల్డ్ రామిస్ దర్శకత్వం వహించారు. ఇందులో బ్రెండన్ ఫ్రేజర్, ఎలిజబెత్ హర్లీ నటించారు. దీనిని 1967 లో వచ్చిన ఒక బ్రిటీష్ మూవీ నుంచి రీమేక్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి ఏడు కోరికలను తీర్చుకోవడానికి, ఒక డెవిల్‌తో ఒప్పందం చేసుకుంటాడు. దానికి బదులుగా ఆ డెవిల్ అతని ఆత్మను అడుగుతుంది. హీరో, హీరోయిన్, డెవిల్ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
రిచర్డ్స్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగిగా జీవితం గడుపుతుంటాడు. అతన్ని అందరూ ఎందుకనో పెద్దగా పట్టించుకోరు. అతనికి ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండరు. మనుషులతో ఎంతగా కలవాలి అనుకున్నా వెనకబడిపోతుంటాడు. అతను తన సహోద్యోగి అలిసన్ ను ప్రేమిస్తుంటాడు. కానీ ఆమె అతన్ని పెద్దగా పట్టించుకోదు. ఒక రోజు అతను అలిసన్‌ను లవ్ లో పడేయాలని, తన జీవితాన్నిడెవలప్ చేసుకోవాలని కోరుకుంటాడు. ఈ సమయంలో, డెవిల్ అతని ముందుకు వస్తుంది. ఆమె చూడటానికి అందంగా, చమత్కారమైన మహిళగా కనిపిస్తుంది. రిచర్డ్స్ కు ఏడు కోరికలను నెరవేర్చే ఒప్పందాన్ని ఆఫర్ చేస్తుంది. దానికి బదులుగా, అతని ఆత్మను తీసుకుంటానని చెబుతుంది. మొదట్లో ఆమె డెవిల్ అని అతను నమ్మడు. అయితే ఆమె మాయలు చూసి తరువాత నమ్ముతాడు. అలిసన్ ను గుర్తుకు చేసుకొని, రిచర్డ్స్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తాడు. ఆతరువాత ప్రతి కోరికలో అలిసన్ ను తన దాన్ని చేసుకుంటాడు. ఈ స్టోరీలు విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉంటాయి. ఇవి అతన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి.
మొదటికోరికలో అలిసన్ తో కలసి ధనవంతుడు అవ్వాలని కోరుకుంటాడు. అయితే అతను ఒక కొలంబియన్ డ్రగ్ లార్డ్‌గా మారతాడు. ఇందులో అలిసన్ రిచర్డ్స్ ను మోసం చేస్తుంది. రెండవ కొరికలో సున్నితమైన వ్యక్తి గా మారుతాడు. ఇందులో అలిసన్ అతన్ని బలహీనుడిగా భావిస్తుంది. మూడవ కొరికలో అతను ఒక ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ఆటగాడిగా మారతాడు. కాని అతనికి శారీరక సామర్థ్యం ఉన్నప్పటికీ, అతని ఆట తీరు అలిసన్‌ను నిరాశపరుస్తుంది. ప్రతి కోరికలోనూ డెవిల్ ఎలియట్‌ను ఆటపట్టిస్తూ ఉంటుంది. రిచర్డ్స్ తన చివరి కోరికను ఉపయోగించి, అలిసన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆమె కోసం తనను తాను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. చివరికి అలిసన్ తో రిచర్డ్స్ సంతోషంగా ఉంటాడా? రిచర్డ్స్ ఆత్మని డెవిల్ తీసుకుంటుందా ? ఈ విషయాలు ఈ మూవీని చూసి తెలుసుకోండి.