L2 Empuraan OTT: గతంలో వచ్చిన లూసీఫర్ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా ఎల్ 2 ఎంపురాన్ తాజాగా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని రాబట్టింది. ఏకంగా 25 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎల్2 ఎంపురాన్ రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు బ్యానర్‌లో విడుదల చేశారు.. లూసిఫర్ క్లైమాక్స్ నుంచే ఈ మూవీ మొదలవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అయితే ఓటిటి హక్కుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఏ ఓటిటి సంస్థ సొంతం చేసుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
Also Read: దెయ్యాలను వదిలించే భూత వైద్యుడు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..
ఓటీటీ డీటెయిల్స్..
ఇటీవల రిలీజ్ అవుతున్న మోహన్ లాల్ మూవీలు అన్నీ భారీ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. అలాగే ఎంపురాన్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేస్తుందని తెలుస్తుంది.. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ పింక్ విల్లా వెల్లడించింది. ఇక సుమారు 4 నుంచి 7 వారాల వ్యవధిలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.. ప్రస్తుతం ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరులో కలెక్షన్స్ ను రాబట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఎల్2 కి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అలాగే, ఇందులో కీలక పాత్రలో నటించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. లూసిఫర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కితే ఎల్2 ఎంపురాన్ రాజకీయ అంశాలతో పాటు ఇందులోనే ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా ను టచ్ చేసి తెరకెక్కించారు.. ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్ని సద్దుమణుగిపించిన స్టీఫెన్ నెడుంపల్లి అజ్ఞాతంలోకి వెళ్తాడు. పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్‌దాస్ భారీగా అవినీతి చేస్తాడు. తను చేస్తున్న అవినీతి పనులను తన సోదరుడు అడ్డుకుంటాడా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ.. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ మూవీ బాడీ డిజాస్టర్ గా మిగిలింది. థియేటర్ల లో ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ ని అందుకున్న మూవీ ఓటిటి లో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..