E-Paper
Advertisement

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో చిన్నపిల్లలు మెచ్చే బెస్ట్ యానిమేషన్ మూవీస్ ఇవే

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో చిన్నపిల్లలు మెచ్చే బెస్ట్ యానిమేషన్ మూవీస్ ఇవే
Advertisement

OTT Movie : యానిమేషన్ సినిమాలను చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యానిమేషన్ సినిమాలలో  అడ్వెంచర్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపి ఉంటాయి. పిల్లలతోపాటు, పెద్దలు కూడా ఈ సినిమాలను చూస్తూ బాగా ఎంటర్టైన్ అవుతారు. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఈ సినిమాలోని మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యానిమేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం పదండి.

ది సీ బీస్ట్ (The Sea Beast)

Advertisement

2022 లో వచ్చిన ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీకి క్రిస్ విలియమ్స్ దర్శకత్వం వహించగా, జెడ్ ష్లాంగర్‌ దీనిని నిర్మించాడు. ఈ మూవీకి కార్ల్ అర్బన్, జారిస్-ఏంజెల్ హాటర్, జారెడ్ హారిస్ మరియు మరియాన్ జీన్-బాప్టిస్ట్ స్వరాలు అందించారు.ఇది ఒక సముద్ర రాక్షసుడు రెడ్ బ్లస్టర్ అని పిలువబడే అంతుచిక్కని మృగం కోసం వెతకడానికి, ఒక అనాథ అమ్మాయి వెళుతుంది. ఈ మూవీ జూన్ 24, 2022న థియేట్రికల్ గా విడుదల అయింది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుని, విడుదలైన మొదటి ఐదు నెలల్లో 165 మిలియన్ గంటలు వీక్షించబడిన అత్యంత విజయవంతమైన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమేషన్ చిత్రంగా నిలిచింది.

చికెన్ రన్ : డాన్ ఆఫ్ ది నగెట్ : (Chicken run : Dawn of The Nugget)

Advertisement

2023లో రిలీజ్ అయిన ఈ యానిమేషన్ మూవీకి సామ్ ఫెల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఆర్డ్‌మ్యాన్ యానిమేషన్స్ నిర్మించింది. థాండివే న్యూటన్, జాకరీ లెవి, బెల్లా రామ్‌సే, రొమేష్ రంగనాథన్, డేవిడ్ బ్రాడ్లీ, డేనియల్ మేస్, జేన్ హారోక్స్, ఇమెల్డా స్టాంటన్, లిన్ ఫెర్గూసన్, జోసీ-డి సెడ్గ్ స్వరాలు అందించారు. చికెన్ రన్: డాన్ ఆఫ్ ది నగ్గెట్ 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 14 అక్టోబర్ 2023న వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. నెట్‌ఫ్లిక్స్ లో 15 డిసెంబర్ 2023న ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీ విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు కూడా అందుకుంది.

ది మిచెల్స్ వర్సెస్ ది మెషీన్స్ (The Mitchells vs The Machines)

2021 లో రిలీజ్ అయిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ యానిమేటెడ్ మూవీని కొలంబియా పిక్చర్స్, సోనీ పిక్చర్స్ యానిమేషన్ నిర్మించారు. ఈ మూవీకి మైక్ రియాండా దర్శకత్వం వహించారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్, కర్ట్ ఆల్బ్రెచ్ట్ నిర్మాతలుగా పనిచేశారు. మిచెల్ కుటుంబం ఒక రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు, రోబోల ప్రపంచ తిరుగుబాటు నుండి భూమిని రక్షించాలనుకుంటారు మిచెల్ కుటుంబం. సోనీ పిక్చర్స్ యానిమేషన్ చిత్రం స్పైడర్ మ్యాన్: ఇన్‌టు ది స్పైడర్-వెర్స్ మాదిరిగానే, ఈ మూవీకి కూడా యానిమేషన్ శైలిని సోనీ పిక్చర్స్ ఉపయోగించింది.

మై ఫాదర్స్ డ్రాగన్ (My Father’s Dragon)

2022 లో వచ్చిన ఈ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీకి నోరా ట్వోమీ దర్శకత్వం వహించగా, మెగ్ లెఫావ్ స్క్రీన్‌ప్లే అందించారు. ఇది రూత్ స్టైల్స్ గానెట్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది.

క్లాస్ (Klaus)

2019 లో వచ్చిన యానిమేటెడ్ క్రిస్మస్ అడ్వెంచర్ కామెడీ మూవీకి సెర్గియో పాబ్లోస్ దర్శకత్వ వహించారు. అతని సొంత సంస్థ SPA స్టూడియోస్ ఈ మూవీని నిర్మించింది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×