Ind vs Eng, 3rd ODI: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య… ఇవాళ చిట్ట చివరి వన్డే జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… ప్రాక్టీస్ తరహాలో ఎంచుకున్న ఈ వన్డే సిరీస్ ను ఇప్పటికే టీమిండియా గెలిచింది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇవాళ మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా… మూడవ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ మధ్యాహ్నం ఒకటి గంటలకు వేయనున్నారు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా దూరం.. అతను వస్తున్నాడు ?
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయన కుమారుడు ఐసీసీ చైర్మన్ జై షా ఇద్దరు హాజరయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా నరేంద్ర మోడీ కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు నిర్ణయం తీసుకున్నారట. కానీ ప్రస్తుతం ఆయన విదేశీ టూర్లలో బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ కోసం భారీ మార్పులతో రంగంలోకి దిగబోతుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తుది జట్టులో రిషబ్ పంత్, అలాగే అర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఆడాలంటే జట్టులో ఉన్న ఇద్దరు పై వేటు పడే ఛాన్సులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ ను పక్కకు పెట్టి… టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఛాన్సులు ఇవ్వనున్నారు. అలాగే హర్షిత్ రానా స్థానంలో అర్షదీప్ బరిలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే మహమ్మద్ షమీని కూడా… పక్కకు పెట్టబోతున్నారని అంటున్నారు. కనీసం టీమ్ ఇండియాలో మూడు కాకుండా రెండు మార్పులు అయితే కచ్చితంగా కనిపిస్తున్నాయి. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య… ఇవాళ జరిగేచిట్ట చివరి వన్డే మ్యాచ్ ను హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.
Also Read: Riyan Parag: అనన్య, సారా ప్రైవేట్ వీడియోలపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్ ?
టీమిండియా ప్రాబబుల్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్/రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, వరుణ్ CV, మహమ్మద్ షమీ
ఇంగ్లండ్ సంభావ్య XI: ఫిలిప్ సాల్ట్ (w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్/జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్/బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్/జోఫ్రా ఆర్చర్