Best Telugu Web Series in disney +hotstar 2024 : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 2024 లో స్ట్రీమింగ్ కు వచ్చిన వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వెబ్ సిరీస్ లను మళ్లీ మళ్లీ చూసి రిలాక్స్ అవుతున్నారు మూవీ లవర్స్. వీటిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లు బాగా ట్రెండ్ అయ్యాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ వెబ్ సిరీస్ లను చూడకపోయిఉంటే, ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసి రిలాక్స్ అవ్వండి.
సేవ్ ది టైగర్స్ (Save The Tigers)
ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని, దేవయాని శర్మ ప్రధాన పాత్రధారులుగా నటించారు. గతేడాది వచ్చిన సేవ్ ది టైగర్స్ సీజన్ వన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సీజన్ వన్ లో వచ్చిన అన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా, రిలాక్సేషన్ అనిపించే విధంగా చిత్రీకరించారు మేకర్స్. 2024 మార్చ్ 15 నుంచి సేవ్ ది టైగర్ స్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2 కి కూడా భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ప్రియదర్శి కామెడీ ఈ వెబ్ సిరీస్ కి హైలెట్ గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భార్యాభర్తలు పడే గొడవలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ఈవారం ఎంటర్టైన్ కోసం ఏమైనా చూడాలనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసేయండి.
మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect)
ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి కి ఓసిడి సమస్య ఉండటంతో, ఆమె ప్రతిదీ చాలా శుభ్రంగా ఉండాలి అనుకుంటుంది. ఈ క్రమంలో అభిజిత్ ఇంటికి పనిమనిషి రాలేదని చెప్పడానికి ఒకసారి లావణ్య వెళ్లవలసి వస్తుంది. అక్కడ అభిజిత్ ఇల్లు శుభ్రంగా లేకపోవడంతో ఆ ఇంట్లో అన్ని చక్కగా సర్దుతుంది. ఇలా ఒక కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న లావణ్య, అభిజిత్ ఇంట్లో పనిమనిషిగా నటిస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ సరదాగా సాగిపోతూ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ కు విశ్వక్ కండేరావ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ 2024 ఫిబ్రవరి 2 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడగలిగే వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇప్పటివరకు చూడనట్లయితే మిస్ చేసుకోకుండా ఈ వెబ్ సిరీస్ పై ఓ లుక్కేయండి.
యక్షిణి (Yakshini)
మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, వేదిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ సిరీస్ కి తేజ మర్ని దర్శకత్వం వహించారు. బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించడం వలన ఈ సిరీస్ కి బాగా పేరు వచ్చింది. మాయ అనే ఆత్మ తను చేసిన ఒక తప్పుకు మనుషుల మధ్య బతకాలని శపించబడుతుంది. అయితే తన జాతి సంరక్షణకు వంద మంది పురుషులను బలి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళుతుంది. అయితే కృష్ణ అనే వ్యక్తిని కలిసిన తర్వాత ఆ సంకల్పం కరిగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది.