-దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి
-ప్రారంభానికి సిద్దం అయిన న్యూ పంబన్ బ్రిడ్జి
-పైనుంచి రైలు, కిందనుంచి బోట్లు
-ఆటోమేటిక్ గా గేట్లు తెరుచుకునే ఏర్పాట్లు
-సెన్సర్స్ ద్వారా పనిచేసే గేట్లు
-గతంలో 16 మంది మనుషులు
-దేశంలోనే అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం
-105 సంవత్సరాల చరిత్ర గల పాత పంబన్ బ్రిడ్జి
-రూ.250 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం
-పాత బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 లక్షలు
-ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన మంత్రి
(స్వేచ్ఛ ప్రత్యేకం)
New Pamban Bridge: దేశంలోనే తొలిసారిగా వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి సిద్ధమవుతోంది. తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో ఉంది. పాత పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఈ సీ బ్రిడ్జి రూపుదిద్దుకోబోతోంది. ఇది 105 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారిచే నిర్మించబడింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ న్యూ సీబ్రిడ్జి అపురూప దృశ్యాలను సోషల్ మీడియాలోషేర్ చేశారు. అది చూసిన నెటిజెన్స్ వావ్ నిజంగా అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని మంత్రి కామెంట్ చేశారు.
సేవలు నిలిపివేత
105 సంవత్సరాలు నిరంతరం సేవలందించిన పాత పంబన్ రైలు తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిపివేశారు. త్వరలో దాని స్థానంలో రాబోతున్న న్యూ పంబన్ సీ బ్రిడ్జి నిర్మాణంలోనే ఓ అద్భుతమని మంత్రి అంటున్నారు.
సెన్సర్లతో అద్భుతం
ఈ న్యూ వేవ్ పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలే వేరు. నిర్మాణ రంగంలోనే ఓ అద్భుత ప్రక్రియ. ఓడలు బ్రిడ్జి వద్దకు వచ్చాయంటే దానంతట అదే పైకి లేచే విధంగా దీనిని సెన్సర్లతో రూపొందించారు. 2070 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది. కిందనుంచి ఓడలు సాగిపోతూ ఉంటాయి. మత్యకారులకు తమ సరుకు రవాణాకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా రైళ్లకు అత్యంత వేగంగా సరుకును చేరుస్తుంటారు. దీని వలన వారికి సమయం, దూరం కూడా ఆదా అవుతుంది.
Also Read: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం నేడే.. ఇక్కడి నుంచే ఏయే రైళ్లు వెళ్తాయో తెలుసా?
పాసింగ్ గేట్లు
గతంలో రూపొందించిన పాత బ్రిడ్జికి ఏదైనా బోట్లు వస్తే మనుషులే వచ్చి చక్రం తిప్పి పాసింగ్ గేట్లు పైకి ఎత్తవలసి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జికి అత్యాధునిక సాంకేతికతను జోడించడంతో సెన్సర్ల సాయంతో వాటంతట అవే బోట్లు వస్తే పైకి లేస్తాయి. దానితో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ విధానంతో రూపొందించిన బ్రిడ్జి దేశంలోనే ఇదేప్రధమం కావడం వవిశేషం.
రూ.20 లక్షలతో పాత బ్రిడ్జి
1914 పంవతంపకంలొ కాబుజవంకం ద్వీపం మధ్య పంబన్ పాత బ్రిడ్జిని సముద్రంలో నిర్మించడం జరిగింది. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీని నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. నిరంతరం 16 మంది కార్మికులు పనిచేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది. 2019 సంవత్సరం మర్చిలో ప్రధాని మోదీ దీనిని కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు. దీని నిర్మాణానికి రూ.250 కోట్ల అంచనా వేసింది కేంద్రం. ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రామేశ్వరానికి రైళ్లు స్పీడ్ గా నడిపేందుకు అవకాశం ఉంటుంది. అధిక లోడ్ బరువులను సైతం తీసుకెళ్లేందుకు తోడ్పడుతుంది.
రాకపోకల నిలిపివేత
భారతదేశంలోని ప్రధాన భూభాగంలోని మండపంతో కలిపే రైల్వే వంతెన పంబన్ వంతెన. ఫిబ్రవరి 24న 1914న ఈ వంతెన ప్రారంభించబడింది. ఇది భారతదేశపు మొట్లమొదటి సముద్ర వంతెన. 2010లో బాంద్రా-వర్లీసీ లింక్ ను ప్రారంభించేదాకా భారత్ లోనే అతి పొడవైన సముద్ర వంతెన ఇది. ఇది చాలా వరకూ కాంక్రీట్ పై నిర్మించిన సంప్రదాయ సముద్ర వంతెన. పియర్స్ కానీ డబుల్-లీఫ్ బాస్క్యూల్ సెక్షన్ మిడ్‌వేని కలిగి ఉంది, ఇది ఓడలు మరియు బార్జ్‌లు గుండా వెళ్లేలా పెంచవచ్చు.రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగానికి అనుసంధానిచే ఏకైక ఉపరితల రవాణా పంబన్ వంతెన అని చెప్పవచ్చు. అయితే 2022 నుంచి ఈ వంతెనపై రైలు రాకపోకలు నిలిపివేవారు. వంతెన తుప్పుపట్టిన కారణంగా ప్రమాదం ఉంటుందని దీని స్థానంలో కొత్త వంతెన రూపుదిద్దుకుంది. నాడు బ్రిటీష్ వారు శ్రీలంకతో వాణిజ్య ఒప్పందాలు అనుసంధానించుకోవడానికి ఈ పంబల్ బ్రిడ్జి నిర్మించారు. 1964 లో వచ్చిన తుఫాను కారణంగా ఈ వంతెన కొంత భాగం దెబ్బతింది. 1911 లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణ పనులు 1914 నాటికి పూర్తయ్యాయి.
Raising the Bar of Connectivity!
The Lift Span of the New Pamban Bridge has been launched successfully. A modern engineering marvel, it will enhance Rail connectivity to Rameswaram island and allow larger boats to pass underneath.#RailInfra4TamilNadu pic.twitter.com/oOWMiS71sx
— Ministry of Railways (@RailMinIndia) August 5, 2024