Best Web Series on OTT : ఓటిటిలోకి వస్తున్న వెబ్ సిరీస్ లతో మూవీ లవర్స్ పండుగ చేసుకుంటున్నారు. థ్రిల్లర్ కంటెంట్ తో వస్తున్న వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సెన్సార్ లేకుండా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లను కొన్ని ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటే, మరికొన్ని ఒంటరిగా చూడడమే మంచిదనిపిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
పాతాళ లోక్ 2 (Patal lok 2)
మన ఇండియన్ కంటెంట్ నుంచి సూపర్ హిట్ అయిన పలు ఫేమస్ వెబ్ సిరీస్ లలో “పాతాళ లోక్” కూడా ఒకటి. గత లాక్ డౌన్ లో వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1 పలు కాంట్రవర్సీలతో పాటుగా పెద్ద హిట్ అయ్యింది. దాదాపు ఐదేళ్ల తర్వాత దీనికి సీజన్ 2 మంచి అంచనాలు నడుమ వచ్చింది. అవినాష్ అరుణ్ ధవారే దీనికి దర్శకత్వం వహించగా, కర్ణేశ్ శర్మ, బబిత ఆశివాల్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో జైదీప్ అహ్లావత్, ఇష్వాకే సింగ్, మెరెన్ల ఇంసొంగ్, కాగిరాంగ్, నగేష్ కుమార్, తిలోత్తమా షోమే తదితరులు నటించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కింగ్‌డమ్ (Kingdom)
కింగ్‌డమ్ అనే ఈ టెలివిజన్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఒరిజినల్ కొరియన్ సిరీస్‌గా, జనవరి 25, 2019న ప్రదర్శించబడింది. ఇందులో జు జి-హూన్, బే డూనా, ర్యూ సెంగ్-రియోంగ్, కిమ్ సాంగ్-హో, కిమ్ సంగ్-క్యు మరియు కిమ్ హై-జున్ నటించారు. ఆరు ఎపిసోడ్స్ తో వచ్చిన మొదటి సీజన్ కు కిమ్ సియోంగ్-హున్ దర్శకత్వం వహించారు. రెండవ సీజన్ కి పార్క్ ఇన్-జే దర్శకత్వం వహించారు. 17వ శతాబ్దం ప్రారంభంలో, ఇమ్జిన్ యుద్ధం ముగిసిన మూడు సంవత్సరాల తర్వాత ఆ రాజ్యంలో జోంబీ వైరస్ సోకుతుంది. ఈ సీరీస్లో జోసెయోన్ క్రౌన్ ప్రిన్స్ లీ అనే రాజుకు కూడా ఈ మర్మమైన వైరస్ సోకుతుంది. అతను తన రాజకీయ ప్రత్యర్థులను సింహాసనాన్ని స్వాధీనం చేసుకోకుండా ఆపుతూ, రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కొరియన్ టెలివిజన్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాత్ జవాన్ హై (Raat Jawan Hai)
రాత్ జవాన్ హై అనే ఈ సిరీస్ కు సుమీత్ వ్యాస్ దర్శకత్వం వహించగా, ఖ్యాతి ఆనంద్ పుత్రన్ రచన చేశారు. యామిని పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ సిరీస్ లో బరున్ సోబ్తి, అంజలి ఆనంద్, ప్రియా బాపట్ నటించారు. ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీలివ్ (SonyLIV) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
మై నేమ్ (My name)
2021లో వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ కి కిమ్ జిన్-మిన్ దర్శకత్వం వహించారు. ఇందులో హాన్ సో-హీ, పార్క్ హీ-సూన్ మరియు అహ్న్ బో-హ్యూన్ నటించారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఒక ముఠాలో చేరిన ఒక మహిళ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అక్టోబర్ 7, 2021న ‘ఆన్ స్క్రీన్’ విభాగంలో 26వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లలో మూడు ఎపిసోడ్‌లు ప్రదర్శించబడ్డాయి. అక్టోబర్ 15, 2021 నుండి ఈ ఈ కొరియన్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.