BigTV English

OTT Movie : ఈ మూవీని చూస్తే లైఫ్ లో అస్సలు బిర్యానీని ముట్టుకోరు ఒట్టు… ఇంత రియలిస్టిక్ గా ఎలా తీశారు భయ్యా ?

OTT Movie : ఈ మూవీని చూస్తే లైఫ్ లో అస్సలు బిర్యానీని ముట్టుకోరు ఒట్టు… ఇంత రియలిస్టిక్ గా ఎలా తీశారు భయ్యా ?

OTT Movie : మలయాళం ఇండస్ట్రీ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయింది. సరికొత్త స్టోరీలు వస్తుండటంతో, ఈ సినిమాలకు ఫిదా అవుతున్నారు. కంటెంట్ నచ్చితే ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు.  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ముస్లిం యువతి చుట్టూ తిరుగుతుంది. ఇందులో క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల హృదయాలను కదలిస్తుంది. ఈ సినిమాలో ఉన్న వివాదాస్పద కంటెంట్ కారణంగా కొన్ని థియేటర్లలో ప్రదర్శనను కూడా నిలిపివేశారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మలయాళం మూవీ పేరు ‘బిరియాని’ (Biriyaani). 2020 లో వచ్చిన ఈ సినిమాకి సజిన్ బాబు దర్శకత్వం వహించారు. ఇందులో కాని కుసృతి (ఖదీజా), షైలజ జాల (ఖదీజా తల్లి), అనిల్ నెడుమంగడ్, మరియు సుర్జిత్ గోపినాథ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం కేరళలోని ఒక సాంప్రదాయ ముస్లిం సమాజంలో మహిళలు ఎదుర్కొనే మతపరమైన, సామాజిక ఒత్తిళ్లను చూపిస్తుంది. ఈ మూవీ 2019లో ఆసియాటికా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అవ్వడంతో పాటు, NETPAC అవార్డ్‌ను కూడా గెలుచుకుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కాని కుసృతి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుకుకుంది. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది. ఇది Airtel Xstream Play, Amazon Prime Video లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఖదీజా అనే ఒక ముస్లిం మహిళ, కేరళలోని ఒక సాంప్రదాయ ఇంట్లో నివసిస్తుంది. ఆమెకు పెద్దలు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపుతారు. ఆమె భర్త, ఆమెను కేవలం కోరికలను తీర్చే ఒక వస్తువుగా చూస్తాడు. అంతే కాకుండా ఆమె భర్త తనని హింసిస్తాడు. ఇందులో మతపరమైన అంశాలు, పురుషాధిపత్యం వల్ల కొన్ని సంఘటనలు హైలైట్ అవుతాయి. మరో వైపు ఖదీజా సోదరుడు ఒక ఉగ్రవాద సంస్థలో చేరినట్లు వార్తలు వచ్చినప్పుడు ఆమె జీవితం పూర్తిగా తలక్రిందులవుతుంది. ఖదీజా తమ్ముడు కనిపించకుండా పోవడంతో ఖదీజా తల్లి సమాజం నుండి బహిష్కరణకు గురవుతుంది. పోలీసులు, సమాజ ఒత్తిడి మధ్య, ఖదీజా భర్త ఆమెకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా విడాకులు ఇస్తాడు.

ఇక ఖదీజా బతకడానికి పోరాటం చేస్తూ, వేశ్యా వృత్తిలోకి అడుగుపెడుతుంది. దీనిని ఆర్థిక అవసరాలకోసం ఆమె ఒక మార్గంగా ఎంచుకుంటుంది. ఆ తరువాత ఆమెపై స్థానిక వ్యక్తి ఆసక్తి చూపించడంతో అతనితో సంబంధం పెట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కుంటుంది. ఇక వీటితో విసిగిపోయిన ఖదీజా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆమెను ఇబ్బంది పెట్టిన మత నాయకులు, రాజకీయ నాయకులు, ఆమె మాజీ భర్త, పోలీసులకు ఒక ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తుంది. ఒక భయంకరమైన చర్యలో, ఆమెకు గర్భస్రావం అయిన శిశువును బిరియానీలో వండి వారికి సర్వ్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ సన్నివేశం ఈ సినిమాలో హైలెట్ అయినా, ఒక మహిళ ఆవేదన కళ్ళకు కట్టినట్లు చూపించారు.

Read Also : ఒక్కొక్క గ్యాంగ్‌స్టర్‌ కు అందంగా నరకం చూపించే బార్ డ్యాన్సర్… 8.2 రేటింగ్ ఉన్న సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్

Related News

OTT Movie : కన్న కూతురిని జూదానికి బలిచ్చే తండ్రి… మొత్తం అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : చావుకు దగ్గరైన వాళ్ళను సింథటిక్ బొమ్మలుగా… ఏలియన్ ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్… భవిష్యత్తు అంటేనే భయపెట్టే సై-ఫై సిరీస్

OTT Movie : ప్రియురాలిని పరాయి మగాళ్లకు పణంగా… 16 ఏళ్ల వయసులో రాకూడని కష్టం… కిరాక్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తాగుబోతుకు గుడ్ డే… మైకంలోనే కేసును సాల్వ్ చేసే మతలబు… ఐఎండీబీలో రేటింగ్ 8 ఉన్న తమిళ మూవీ

OTT Movie: ఫ్రెండ్‌ను ఆవహించి.. 7 రోజులు గత్తరలేపే దెయ్యం.. ఇండోనేషియాలో రికార్డులు బ్రేక్ చేసిన హార్రర్ మూవీ ఇది

Big Stories

×