BigTV English

OTT Movie : ఒక్కొక్క గ్యాంగ్‌స్టర్‌ కు అందంగా నరకం చూపించే బార్ డ్యాన్సర్… 8.2 రేటింగ్ ఉన్న సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్

OTT Movie : ఒక్కొక్క గ్యాంగ్‌స్టర్‌ కు అందంగా నరకం చూపించే బార్ డ్యాన్సర్… 8.2 రేటింగ్ ఉన్న సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్

OTT Movie : ‘మాఫియా’ ఈ పేరు వినగానే ముందుగాముంబై సిటీ గుర్తుకు వస్తుంది. అక్కడ చీకటి సామ్రాజ్యాన్ని గ్యాంగ్ స్టర్లు నడుపుతుంటారు. ఎప్పుడూ ఏదో ఒక గ్యాంగ్ వార్ లో ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటారు. ఇది 1980 దశకంలో మరింత ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. భర్త చావుకు రివేంజ్ తీర్చుకునే ఒక మహిళ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


‘ఎమ్ ఎక్స్ ప్లేయర్’ (MX Player) లో

‘ఏక్ థి బేగం’ (Ek Thi Begum). ఇది 1980లో ముంబై అండర్‌వరల్డ్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ సచిన్ దరేకర్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుజా సాథే, అంకిత్ మోహన్, చిన్మయ్ మాండ్లేకర్, రాజేంద్ర శిసత్కర్, సంతోష్ జువేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రెండు సీజన్‌లను కలిగి ఉంది: సీజన్ 1 (2020) 14 ఎపిసోడ్‌లతో విడుదలైంది. సీజన్ 2 (2021) 12 ఎపిసోడ్‌లతో విడుదలైంది. ఇది సప్నా దీదీ (అశరఫ్ భట్కర్) అనే మహిళ కు చెందిన ఒక రియల్ స్టోరీ. ఆమె తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ముంబై అండర్‌వరల్డ్‌లోని శక్తివంతమైన డాన్‌ను ఎదిరించింది. MX Player లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

అశరఫ్ భట్కర్ అలియాస్ సప్నా ఒక తెలివిగల అందమైన అమ్మాయి. ఆమె జహీర్ భట్కర్ ను వివాహం చేసుకుంటుంది. అతను ఒకప్పుడు శక్తివంతమైన అండర్‌వరల్డ్ డాన్ మక్సూద్ కి అనుచరుడిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అతని శత్రువు గా మారుతాడు. ముంబై లో మక్సూద్ దుబాయ్ నుండి తన డ్రగ్ కార్టెల్‌ను నడుపుతుంటాడు. మక్సూద్ గ్యాంగ్‌తో జహీర్ శత్రుత్వం పెరుగుతుంది. దీనివల్ల ఒక ఘర్షణలో మక్సూద్ గ్యాంగ్‌లోని నానా మాత్రే సోదరుడు రఘు మాత్రే జహీర్ చేతిలో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా, నానా మాత్రే కరప్ట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తావ్డే సహాయంతో మక్సూద్ కు ఒక స్కెచ్ వేస్తాడు. 1986 జులై 26న, జహీర్‌ను విమానాశ్రయం నుండి నానా మాత్రే కిడ్నాప్ చేసి, అతన్ని దారుణంగా హత్య చేస్తాడు. గర్భవతిగా ఉన్న అశరఫ్‌ను చంపకుండా వదిలేస్తాడు.

అశరఫ్ తన భర్త హత్యకు ప్రతీకారంగా, మక్సూద్ అక్రమ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమె తన అందం, తెలివిని ఉపయోగించి పోలీస్ ఇన్ఫార్మర్‌గా మారుతుంది. ఆమె ఒక బార్‌లో డాన్స్ చేస్తూ, సప్నా అనే కొత్త పేరుతో మాఫియా ప్రపంచానికి పరిచయం అవుతుంది. అక్కడ ఆమె నానా మాత్రే గ్యాంగ్‌లోని షార్ప్‌షూటర్ సావ్త్యా ను తన వైపు తిప్పుకుంటుంది. ఆతరువాత ఆమె నానా మాత్రేకు సన్నిహితంగా ఉంటుంది. అతని డ్రగ్ కన్సైన్‌మెంట్‌ల గురించి పోలీసులకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల నానా అరెస్టు అవుతాడు. అయితే, నానా సప్నా ఎవరో తరువాత తెలుసుకుని, ఆమెను చంపుతానని బెదిరిస్తాడు. ఇక క్లైమాక్స్ ఒక ఊహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి సప్నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటుందా ? నానా మాత్రేతో వైరం ఎక్కడిదాకా వెళ్తుంది ? సప్నా ముంబై మాఫియాలో ఎలా నిలబడుతుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అబ్బాయిల్ని బోనుల్లో బంధించి అలాంటి పని… ఐఎండీబీలో 7.1 రేటింగ్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

Related News

OTT Movie : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : మనిషి లోపల మకాం పెట్టే చిట్టి ఏలియన్స్… భూమిని తుడిచి పెట్టే ప్లాన్ తో రంగంలోకి.

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×