OTT Movie : కొన్ని సినిమాలు కామెడీతో గందరగోళం సృష్టిస్తాయి. కడుపుబ్బా నవ్విస్తూ, థ్రిల్లింగ్ ని కూడా ఇస్తాయి. ఇటువంటి సినిమాలు చివరివరకు సరదాగా సాగిపోతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు కాస్త టెన్షన్ పెట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక రాత్రి జరిగే సంఘటనతో తెరకెక్కింది. అందులో హీరో, దొంగలు కొట్టేసిన నగలతో పారిపోతుంటాడు. ఇతని చుట్టూ కొన్ని గ్యాంగులు కూడా పరుగెడతాయి. గజిబిజి గందరగోళం మధ్య ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లాక్అవుట్’ (Blackout). 2024 లో విడుదలైన ఈ మూవీకి దేవాంగ్ శశిన్ భవ్సర్ దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, నీరజ్ కొఠారి దీనిని నిర్మించారు.ఇందులో విక్రాంత్ మాస్సే, రుహాని శర్మ, సునీల్ గ్రోవర్, మౌని రాయ్, జిషు సేన్‌గుప్తా, అనంత్ విజయ్ జోషి వంటి నటులు నటించారు. ఈ సినిమా పూణే నగరంలో ఒకే రాత్రి జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ విద్యుత్ కోత కారణంగా నగరం చీకటిలో మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో క్రైమ్ రిపోర్టర్ లెన్నీ డిసౌజా జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
లెన్నీ డిసౌజా ఒక క్రైమ్ జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతను ఒక రోజు రాత్రి, తన భార్య రోష్నీ కోసం ఆహారం కొనడానికి బయటకు వెళ్తాడు. అదే సమయంలో, పూణే నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మరోవైపు ఇదే అదును చూసుకొని, దొంగలు ఒక ఆభరణాల దుకాణాన్ని దోచుకోవడానికి ప్లాన్ వేస్తారు. లెన్నీ ఆ రాత్రి తన స్నేహితుడు రవిని దారిలో కలసి, అతన్ని ఇంటి దగ్గర దింపుతాడు. ఆ సమయంలో, దొంగలు ఆభరణాల దుకాణం నుండి బంగారం, నగదును దొంగిలించి, వారి వ్యాన్‌లో పారిపోతుంటారు. దురదృష్టవశాత్తూ, లెన్నీ వారి వ్యాన్‌ను ఢీకొడతాడు. దీనితో వ్యాన్ ప్రమాదానికి గురై, లోపల ఉన్నవారు చనిపోతారు. లెన్నీ వ్యాన్‌లో బంగారం, నగదును చూసి, ఒక పెట్టెను తీసుకుని పారిపోతాడు.
అయితే, అతని ప్రయాణంలో మరో ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ అతను ఒక వ్యక్తిని ఢీకొడతాడు. ఇక్కడ నుండి, అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. అతని చుట్టూ కొంతమంది వచ్చి చేరుతారు. రాత్రంతా, లెన్నీ ఈ బంగారాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని చుట్టూ ఉన్నవారు అతన్ని మోసం చేసి వాటిని దొంగిలించడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో, గ్యాంగ్ వార్, డిటెక్టివ్, మాఫియా డాన్ ముగిల్ అన్నా పాత్రలతో, అనేక ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. చివరికి లెన్నీ ఈ అస్తవ్యస్త రాత్రి నుండి ఎలా బయటపడతాడు ? అతడు ఎదుర్కునే ఇబ్బందులు ఏమిటి ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే, మీరుకూడా ఈ కామిడీ ఎంటర్టైన్ మూవీని చూసి తెలుసుకోండి.