Allu Sneha Reddy:సాధారణంగా స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారనే వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియాకు దూరంగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కూడా.. అయితే మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహారెడ్డి (Sneha Reddy) మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ అల్లు, మెగా అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా అటు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అల్లు స్నేహారెడ్డి అభిమానులకి కూడా ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అందుకే స్నేహ అకౌంట్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పాటు రీచ్ కూడా ఎక్కువే అని చెప్పాలి.
SSMB 29: జైలు నుండి విముక్తి.. అక్కడ ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్..!
హాస్పిటల్ బెడ్ నుండి ఫోటో షేర్ చేసిన అల్లు స్నేహారెడ్డి..
ఇదిలా ఉండగా తాజాగా అల్లు స్నేహారెడ్డి తన ఇన్స్టా లో షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ స్టోరీలో హాస్పిటల్ లో ఒక అమ్మాయికి రక్తం ఎక్కిస్తూ ఉండగా.. ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ అని కూడా రాసి ఉంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ “నాకు ప్రస్తుతం ఏం కావాలంటే ?”అనే క్యాప్షన్ కూడా జోడించింది స్నేహ. దీన్ని బట్టి చూస్తే అల్లు స్నేహారెడ్డికి వెకేషన్ కి వెళ్లాలనే ఆలోచన ఉందేమో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి పోస్ట్ చూసి కంగారు పడుతున్నారు. ఎప్పుడూ లేనిది స్నేహ ఎందుకు ఇలాంటి స్టోరీ పెట్టింది.. అని కొందరు అంటే.. మరి కొంతమంది ఫ్యామిలీలో ఎవరికైనా బాలేదా? వారికి రక్తం కావాలా? అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అల్లు స్నేహా కి ఆరోగ్యం బాగాలేదని , అందుకే హాస్పిటల్ లో జాయిన్ అయిందని, ఇప్పుడు ఈ విషయంపైనే హింట్ ఇస్తోందని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే అల్లు స్నేహారెడ్డి ఏ కారణంతో ఈ స్టోరీ పెట్టిందో తెలియదు కానీ దీనిపై మాత్రం నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లు అర్జున్ – అల్లు స్నేహారెడ్డి ప్రేమ, పెళ్లి..
ఇకపోతే అల్లు స్నేహారెడ్డి , అల్లు అర్జున్ కి 2011లో పెళ్లయింది. వీరిద్దరూ ప్రేమించుకొని మరీ ఇరు కుటుంబాలను ఒప్పించి, పెద్దలు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వివాహాలలో వీరిది కూడా ఒకటి. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయాన్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకోగా.. అర్హ మరొకవైపు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సమంత (Samantha ) లీడ్ రోల్ లో వచ్చిన ‘శాకుంతలం’ సినిమాలో నటించి ఆశ్చర్యపరిచింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘పుష్ప2 ‘సినిమా ఇచ్చిన సక్సెస్ తో జోరుగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న ఈయన మరొకవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు చిత్రాలు అల్లు అర్జున్కి ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.