Turmeric Side Effects: యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయని, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కదా అని చాలా మంది పసుపును ఎక్కువగా వాడతారు. దీని వల్ల జీర్ణశయాంతర సమస్యలను తగ్గిపోతాయట. అంతేకాకుండా చర్మాన్ని సంరక్షించడంలో కూడా పసుపు హెల్ప్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు.
పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. గ్యాస్, ఉబ్బరం వంటి అనేక జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్ల నొప్పులను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుందట. లివర్ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని లాభాలు ఉన్నాయి. సరే పసుపును అతిగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
పసుపు వల్ల సైడ్ ఎఫెక్ట్స్..
పసుపును అతిగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి, వికారం, వాంతులు, గుండెల్లో మంట వంటి ఉదర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొందరికి పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ వల్ల చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు, దురద వంటివి వచ్చే అవకాశం ఉందట.
పసుపును ఎక్కువగా తీసుకుంటే రక్తం పల్చబడిపోతుందట. దీని వల్ల హీమోఫిలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో సులభంగా గాయాలు కావడం, ముక్కు నుండి రక్తస్రావం లేదా చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటివి జరుగుతాయట. మరికొందరిలో మూత్రంలో రక్తం వచ్చే ఛాన్స్ ఉందట.
బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శక్తి కోసం కండరాలకు గ్లూకోజ్‌ను పంపించినప్పుడు పసుపు రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుందట. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందట. దీని వల్ల ఇప్పటికే డయాబెటిస్ తగ్గడానికి మెడిసిన్ వాడుతున్న వారిలో చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: వేపింగ్ అంత ప్రమాదకరమా..?
అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పసుపును తక్కువ మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు పసుపును అతిగా తీసుకుంటే కిడ్నీలు రాళ్లు వచ్చే అవకాశం ఉందట.
విటమిన్-కే లోపంతో ఇబ్బంది పడుతున్న వారు పసుపును అధిక మోతాదులో తీసుకునేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలాగే బ్లడ్‌లో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు కూడా దీన్ని మోదాదుకు మించి తీసుకోకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.