OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా ఇందులో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే స్క్విడ్ గేమ్ సిరీస్ ఎంతలా విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సూపర్ నేచురల్ హారర్ మూవీ పేరు ‘యాస్ ద గాడ్స్ విల్‘ (As the gods will) ఈ మూవీకి తకాషి మియికే దర్శకత్వం వహించారు.ఈ జపనీస్ సూపర్ నేచురల్ హారర్ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో ఫూనిమేషన్ ద్వారా హోమ్ మీడియాలో విడుదలైంది.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక కాలేజ్ లో చదువుకుంటూ ఉంటాడు. హఠాత్తుగా అక్కడికి దరుమ అనే బొమ్మ ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఒక భయంకరమైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ బొమ్మ అందర్నీ చంపుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు బొమ్మకి ఎదురుగా వస్తుంటే ఆ బొమ్మ వాళ్ళను చంపుతూ వుంటుంది. విషయం ఏమంటే ఆ బొమ్మకి ఒక బటన్ ఉంటుంది. దాన్ని ఎవరైతే ప్రెస్ చేస్తారో అప్పుడు ఆ గేమ్ ఆగిపోతుంది. క్లాసులో అందరూ ఆ బటన్ నొక్కడానికి ప్రయత్నిస్తారు. కాని వారి ప్రయత్నాలు విఫలమవుతూ చనిపోతారు. చివరికి హీరో ఆ బటన్ ని ప్రెస్ చేస్తాడు. ఆ గేమ్ అక్కడితో ఎండ్ అవుతుంది. క్లాస్ బయటికి హీరో వచ్చాక, హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె క్లాస్ రూమ్ లో కూడా తనొక్కతే గేమ్ గెలిచి ప్రాణాలతో మిగిలి ఉంటుంది. వీళ్లంతా మరొక ప్లేస్ లోకి వెళ్తారు. అక్కడ ఈ గేమ్ గెలిచిన కొంతమంది ఉంటారు. అక్కడ పెద్ద పెళ్లితో మరొక గేమ్ స్టార్ట్ అవుతుంది. పిల్లికి మెడలో గంట ఎవరైనా వేయాలి. ఈ గేమ్ లో కూడా చాలామంది ప్రాణాలు పోతాయి. చివరికి ఆ పిల్లిలో గంట పడుతుంది. ప్రాణాలతో మిగిలినవాళ్ళు మరొక లెవల్ కి వెళ్తారు.
ఒక తెల్ల ఎలుగుబంటి వీళ్ళను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అబద్ధం చెప్పినవాళ్లు చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ కొంతమంది చనిపోతారు. హీరో ఒక ప్రశ్నకు నువ్వు కూడా అబద్ధం చెప్తున్నామంటూ సమాధానం చెప్తాడు. నువ్వు తెల్ల ఎలుగుబంటి కాదని, నల్ల ఎలుగుబంటివని చెప్పడంతో ఆ లెవెల్ పూర్తవుతుంది. ఇక చివరగా ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది అందులో ముగ్గురు మాత్రమే మిగులుతారు. చివరికి గెలిచినందుకు వాళ్ళ ముగ్గురికి ఐస్క్రీం ఇస్తారు. అందులో హీరోకి మాత్రమే గెలిచే అర్హత ఉంటుంది. మిగతా ఇద్దరినీ కూడా చంపేస్తారు. చివరికి హీరో మాత్రమే మిగులుతాడు. బయట ప్రపంచంలో మీడియా ఇది ఉగ్రవాది చర్యగా, లేకపోతే ఏలియన్ చర్యగా అనుకుంటూ ఉంటారు. చివరికి ఈ గేమ్ ని ఎవరు స్టార్ట్ చేశారు? ఇంతమందిని ఎందుకు చంపారు? గెలిచిన తర్వాత హీరో పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.