OTT Movie : హారర్ జానర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు భయం రుచి చూపించింది. నెమ్మదిగా మొదలయ్యే ఈ కథ నడిచే కొద్దీ భయంకరమైన థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని తీసుకుంటుంది. తల్లిదండ్రుల చాటున ఒంటరిగా పెరిగే ఒక చిన్న పిల్లవాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హారర్ ఫ్యాన్స్ కి చుక్కలు చూపించిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సామ్యూల్ బోడిన్ దర్శకత్వం వహించిన భయంకరమైన హారర్ సినిమా ‘కాబ్‌వెబ్’ (Cobweb). ఈ చిత్రంలో లిజ్జీ కాప్లాన్, వుడీ నార్మన్, క్లియోపాత్రా కోల్‌మన్, ఆంటోనీ స్టార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూలై 21న లయన్స్‌గేట్ ఫిల్మ్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
పీటర్ అనే 8 ఏళ్ల బాలుడు ఒంటరిగా ఫీల్ అవుతుంటాడు. అమ్మ కారోల్, నాన్న మార్క్ ఇద్దరూ అతనితో కఠినంగా ఉంటారు. పీటర్‌ను బయటకు కూడా పంపరు. అతనికి స్కూల్‌లో కూడా ఫ్రెండ్స్ లేరు. ఒక రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, గోడలో నుంచి సౌండ్ వస్తుంది. హెల్ప్ మీ అని గొంతు శబ్ధం వినబడుతుంది. పీటర్ భయపడి అమ్మానాన్నకు చెబుతాడు. వాళ్లు ఇది నీ ఊహ అని అంటారు. అయితే ఆ ఇంట్లో సౌండ్ రోజూ వస్తుంటుంది. ఈ సారి గోడ మీద సేవ్ మీ అని రాసి ఉంటుంది. పీటర్ గోడలో ఒక రంధ్రం కనుగొంటాడు. అక్కడ నుంచి సారా అనే గర్ల్ వింత సౌండ్ తో మాట్లాడుతుంది.
Read Also : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ