OTT Movie : హారర్ సినిమాలు మనుషులను భయపెట్టడానికి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని స్టోరీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో, మొక్కజొన్న పంట హత్యలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ మూవీ చవరి వరకు ఆసక్తికరంగా సాగిపోతుంది. హత్యలు జరిగే కొన్ని సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. ఇందులో పిల్లలు పెద్దల్ని చంపుతూ ఉంటారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ స్లాషర్ మూవీ పేరు ‘చిల్డ్రన్ ఆఫ్ ది కార్న్’ (Children of The Corn). 2023 లో వచ్చిన ఈ సినిమా స్టీఫెన్ కింగ్ రాసిన 1977లోని ఒక చిన్న కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు కర్ట్ విమ్మర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ఎలెనా కంపోరిస్, కేట్ మోయర్, కాలన్ మల్వే , బ్రూస్ స్పెన్స్ వంటి నటులు నటించారు. 1 గంట 32 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ R రేటింగ్ ను అందుకుంది.
ఈ సినిమా రైల్‌స్టోన్ అనే చిన్న వ్యవసాయ పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ ప్రధాన పంట అయిన మొక్కజొన్న పంటలు ఉంటాయి. అందులో నుంచే అసలు స్టోరీ మొదలౌతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సినిమా ఒక భయంకరమైన సంఘటనతో మొదలవుతుంది. ఇక్కడ ఒక యువకుడు రైల్‌స్టోన్ చిల్డ్రన్స్ హోమ్‌లోని పెద్దలను హత్య చేస్తాడు. ఈ సంఘటనను అరికట్టడానికి స్థానిక అధికారులు హాలోథేన్ అనే రసాయనాన్ని ఉపయోగించి, 15 మంది పిల్లలను అనుకోకుండా చంపేస్తారు. ఈ దుర్ఘటన తర్వాత, పట్టణంలో పిల్లలు, పెద్దల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి.మరోవైపు బోలిన్ ఒక హైస్కూల్ విద్యార్థిని గా ఉంటుంది. ఆమె కళాశాల కోసం బోస్టన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఆమె తండ్రి రాబర్ట్ స్థానిక నాయకుడు. మొక్కజొన్న పంటకు తెగులు వచ్చి పడవుతుంది. అతను విచారిస్తూ, ప్రభుత్వ సబ్సిడీ కోసం మొక్కజొన్న పంటలను నాశనం చేయాలని ప్రతిపాదిస్తాడు. ఈ నిర్ణయం ఈడెన్ అనే అనాథ బాలికను కోపంతో రగిలిస్తుంది. ఈడెన్ పట్టణంలోని ఇతర పిల్లలను సమీకరించి, పెద్దలపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలు పెద్దలను హత్య లు చేస్తుంటారు. ఈడెన్ తనను ‘ది రెడ్ క్వీన్’గా ప్రకటించుకుంటుంది. ఈ తిరుగుబాటు వెనుక మొక్కజొన్న పంటలో, ఒక ఫంగస్ కారణంగా పిల్లలు హాలూసినేషన్స్‌కు గురవుతారని బోలన్ హెచ్చరిస్తుంది. అయితే ఈడెన్‌ను మొక్కజొన్నపంట ప్రభావితం చేస్తుంది. బోలిన్, ఈడెన్ కు వ్యతిరేకంగా నిలబడిన ఏకైక వ్యక్తిగా మిగిలిపోతుంది. చివరికి ఈ దారుణాలను బోలిన్ ఆపగలుగుతుందా ? మొక్కజొన్న పంట ఎందుకు మనుషుల్ని హింస వైపు ప్రేరేపిస్తుంది ? ఈ విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : టీచర్ కోరికను ఎప్పుడు పడితే అప్పుడు తీర్చే స్టూడెంట్ … పెద్దలు మాత్రమే చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్