OTT Movie : రొమాంటిక్ సినిమాలంటే మొదటిగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ సినిమాలే. వీటిలో వచ్చే కొన్ని సన్నివేశాలు, రాత్రిపూట నిద్ర కూడా పట్టకుండా చేస్తాయి.కళ్ళు పెద్దవి చేసి వీటిని చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో, టీచర్ స్టూడెంట్ లవ్ స్టోరీ తో రొమాన్స్ మొదలవుతుంది. ఈ రొమాన్స్ హద్దులు దాటి అలవాటుగా మారిపోతుంది. ఇక రొమాన్స్ కోసమే బ్రతుకుతున్నట్లు అదే పనిలో ఉంటారు ఈ కామ పిశాచులు. ఈ మూవీని గనుక చూడాలనుకుంటే, ఒంటరిగా చూడటమే మంచిది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ఎ టీచర్’ (A Teacher). 2013లో విడుదలైన ఈ మూవీకి హన్నా ఫిడెల్ దర్శకత్వం వహించారు. ఆమె తొలిసారిగా దీనికి దర్శకత్వం వహించింది. ఇది ఒక విద్యార్థితో, ఒక మహిళా హైస్కూల్ టీచర్ పెట్టుకునే అక్రమ సంబంధం చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యామోహం ఒక అలవాటుగా మారుతుంది. ఈ సినిమా 2013 లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించింది. యునైటెడ్ స్టేట్స్‌లో సెప్టెంబరు 6, 2013న ఈ మూవీని విడుదలచేశారు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ, స్కోర్, స్టోరీ పట్ల ప్రశంసలు కూడా అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘A Teacher’ సినిమా ఆధారంగా ఒక మిని వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. ఇది నవంబర్ 2020లో Huluలో రిలీజ్ చేశారు.
స్టోరీలోకి వెళితే
టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో డయానా వాట్స్ ఒక హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తుంది. ఆమె తన విద్యార్థి ఎరిక్ టుల్‌తో కాస్త క్లోస్ గా ఉంటుంది. ఎరిక్ టీచర్ ని అదోలా చూస్తూ ఉంటాడు. ఇలా ఒకరికి ఒకరు చూసుకుంటూ, కొద్దిరోజుల్లోనే లవ్ లో పడతారు. ఇది అక్రమ సంబంధానికి దారి తీస్తుంది. ఈ రహస్య సంబంధం డయానా కు సంతృప్తిని ఇస్తుంది. ఇక డయానాకు ఎప్పటినుంచో లోపల దాచుకున్న లావా, ఒక్క సారిగా బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. సమయం దొరికినప్పుడల్లా ఎరిక్ తో శృంగారంలో మునిగిపోటుంది. ఇది ఒక వ్యసనంలా మారి హద్దులు కూడా దాటిపోతుంది. త్వరలోనే ఇది ఒక నియంత్రణ లేని ఆకర్షణగా మారుతుంది. డయానా తన సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్రవర్తనతో అది బయట పడిపోతుంది.
ఒక రోజు ఆమె ఇంట్లో ఎరిక్‌తో బట్టలు లేకుండా పని కనిస్తూ ఉంటుంది. వీళ్ళు పక్కన ఎవరున్నారో కూడాతెలీనంతగా, పతాక స్తాయిలో ఉంటారు. అదే సమయంలో, ఆమె రూమ్‌మేట్ అనుకోకుండా వీళ్ళను చూస్తుంది. దీనితో ఇన్నాళ్ళూ సీక్రెట్ గా ఉంచిన సంబంధం బయటపడిపోతుంది. డయానా ఎరిక్ ఇంటికి వెళ్లి అతనిని కలవడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం అతని తండ్రికి తెలిసిపోవడంతో, ఆమెను ఎరిక్ ను కలవకుండా అడ్డుకుంటాడు. ఈ సంబంధం ఆమెను వృత్తి పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని కూడా నాశనం చేసే స్థాయికి చేరుకుంటుంది. చివరికి డయానా తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటుందా ? అలవాటు పడిన పనికి మరొకరితో సంబంధం పెట్టుకుంటుందా ? ఎరిక్ ని మళ్ళీ ముగ్గులోకి దించుతుందా ? ఈ విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.