BigTV English

Bigg Boss : బిగ్ బాస్ వల్ల నా కెరీర్ పోయింది.. కావాలనే అలా క్రియేట్ చేశారు..

Bigg Boss : బిగ్ బాస్ వల్ల నా కెరీర్ పోయింది.. కావాలనే అలా క్రియేట్ చేశారు..

Bigg Boss : బుల్లితెర పై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక్కో సీజన్ కు ఒక్కో విన్నర్, రన్నర్ గా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో ద్వారా చాలా మంది సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. కొందరి లైఫ్ మాత్రం రివర్స్ అయ్యింది. విమర్శలు అందుకోవడంతో కెరీర్ క్లోజ్ అయ్యిందని ఈ మధ్య చాలా మంది సెలెబ్రేటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ బిగ్ బాస్ వల్ల తనకు అన్యాయం జరిగిందని బయటపెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సెలెబ్రేటి ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


Also Read : శేఖర్ మాస్టర్ కు దారుణమైన అవమానం.. హీరో దెబ్బకు ప్యూజులు అవుట్..

బిగ్ బాస్ షో.. 


తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు. బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షోగా హవాను కొనసాగిస్తుంది. 16 మందితో 100 వంద రోజుల ప్రయాణం అనే కాన్సెప్ట్ తో ఈ షో మొదలైంది. ఇప్పటికీ తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకుంది. మరి కొద్ధి రోజుల్లో తొమ్మిదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఈ షో గురించి నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పాల్గొన్న కొందరి జీవితాలు ఆగమ్య గోచరంగా మారాయి అనే వాదన వినిపిస్తుంది. తాజాగా మరో సెలెబ్రేటి తన జీవితం నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది..

నా కేరీర్ క్లోజ్ అయ్యింది.. 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తెజేశ్విని మదివాడ.. మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా అయ్యింది. తన క్రేజ్ వల్లే బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో బుల్లితెర పేక్షకులకు మరింతగా దగ్గర అయింది. అయితే రీసెంట్ గా తేజస్వి మదివాడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ వల్ల తన కెరీర్ క్లోజ్ అయ్యిందని బయట పెట్టింది. షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట వాస్తవం అయినప్పటికీ.. తనకు కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది. నా గురించి లేనివి కూడా బిగ్ బాస్ చూపించడంతో తప్పుడు దాన్ని అయ్యాను అని ఫీల్ అయ్యింది.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షోలో లేడీ కంటెస్టెంట్ గా అలరిస్తోంది. ఈమె లైఫ్ మళ్లీ సినిమాలతో బిజీగా అవుతుందేమో చూడాలి..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×