BigTV English

OTT Movie : మొగుడిని ముక్కలు చేసి కూర వండే పెళ్ళాం… ఏందిరా సామీ ఈ అరాచకం

OTT Movie : మొగుడిని ముక్కలు చేసి కూర వండే పెళ్ళాం… ఏందిరా సామీ ఈ అరాచకం

OTT Movie : కొంతమంది చేసిన తప్పులు వల్ల, వేరొకరు బలవుతూ ఉంటారు. సైకోలుగా మారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక తండ్రి తన పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత పిల్లలే అతన్ని దారుణంగా చంపేస్తారు. ఆ మాంసాన్ని వండి వాళ్ళు నడిపే రెస్టారెంట్ కస్టమర్లకు పెడతారు. ఆ తర్వాత మర్డర్లు చేస్తూ, వాళ్ల మాంసాన్ని వండుకుని తినేస్తుంటారు. ఈ మూవీని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఆన్లైన్లో కూడా దొరకడం చాలా కష్టం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


ఆపిల్ టివి (Apple Tv)

మలేషియా నుంచి వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘క్లే పాట్ కర్రీ కిల్లర్స్’ (Claypot Curry Killers). ఈ థ్రిల్లర్ మూవీకి జేమ్స్ లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ మిసెస్ చూ అనే మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల చుట్టూ తిరుగుతుంది. వారు ఒక చిన్న రెస్టారెంట్ నడుపుతారు.  ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసిన కర్రీ కారణంగా రెస్టారెంట్ చాలా ప్రజాదరణ పొందుతుంది. ఈ కర్రీ ఒక పాత కుటుంబ రెసిపీ ప్రకారం తయారు చేయబడుతుందని అందరూ అనుకుంటారు. కానీ అది మానవ మాంసంతో తయారు చేయబడుతుంది. ఇంత దారుణమైన మూవీని చూడటం కూడా చలా కష్టం గానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఒంట్లో వణుకు తెప్పిస్తాయి. ఆపిల్ టివి (Apple Tv) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మాలికి తన భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటుంది. అయితే మొదటి భర్త వల్ల ముగ్గురు కూతుర్లు పుడతారు. వాళ్ళను కొత్తగా వచ్చిన స్టెప్ ఫాదర్ లైంగికంగా వేధిస్తుంటాడు. ఇది చూసితల్లి కూతుర్లు ఒక్కసారిగా అతన్ని చంపేస్తారు. అతని మాంసాన్ని ముక్కలు చేసి కూర వండుతారు. దానిని వాళ్ళ రెస్టారెంట్ కస్టమర్లకు పెడతారు. ఆ కర్రీ కి మంచి పేరు రావడంతో, రెస్టారెంట్ కూడా పాపులర్ అవుతుంది. అప్పటినుంచి కామాంధులను టార్గెట్ చేసి, వాళ్ళను చంపి వారి రెస్టారెంట్‌ లో వండుతుంటారు. సమయం గడిచేకొద్దీ ఆమె కుమార్తెలు ఈ క్రూరమైన పనిలో భాగం అవుతారు. ప్రతి రాత్రి ఈ అందమైన కుమార్తెలు, మగవాళ్లను ఆకర్షించి వారిని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ వారిని కోసి, ముక్కలు చేసి, కర్రీలో వేస్తారు. మాంసం అయిపోతే మళ్ళీ వేట మొదలు పెడతారు.

అయితే వారి రహస్యం బయటపడే ప్రమాదం ఏర్పడినప్పుడు, కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. మాలి చిన్న కూతురు ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ తరువాత కొంతమంది వల్ల వీళ్ళకు ప్రమాదాలు జరుగుతాయి. వీళ్ళకు అడ్డు వస్తున్న అందరినీ ఒకే సారి చంపేయాలని అనుకుంటారు. ఇందులో చిన్న కూతురు ప్రియుడు కూడా ఉంటాడు. చివరికి మాలి కుటుంబం దారుణమైన ముగింపును చవిచూస్తారా? ఇలాగే చంపుకుంటూ పోతారా ?అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘క్లే పాట్ కర్రీ కిల్లర్స్’ (Claypot Curry Killers) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా సొంత దేశం మలేషియాలో కూడా రెండుసార్లు నిషేధించబడింది.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×