Lokesh Kanagaraj: సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా కూడా కొందరు ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకుంటారు. దాని వల్ల ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతల వల్ల హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. హీరోలు మాత్రం తాము ఒకరికొకరం ఫ్రెండ్లీ అని చెప్పినా కూడా దర్శక నిర్మాతలు మాత్రం తాము కలిసి పనిచేసిన హీరోలే గ్రేట్ అన్నట్టు మాట్లాడడంతో మిగతా హీరోల ఫ్యాన్స్‌కు కోపం వస్తుంది. అలా ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ వల్ల కూడా టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అంటూ ఫ్యాన్ వార్ మొదలయ్యింది. రామ్ చరణ్‌ను పొగుడుతూ లోకేశ్ చేసిన కామెంట్ ఇతర హీరోల ఫ్యాన్స్‌కు నచ్చలేదు.
తెలుగు హీరోతో సినిమా
కోలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు లోకేశ్ కనకరాజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా దాని ద్వారా వెంటనే ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. పైగా స్టార్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేస్తూ మల్టీ స్టారర్ సినిమాలు ఇంతకంటే బాగా ఎవరూ హ్యాండిల్ చేయలేరు అని నిరూపించాడు. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌత్‌లోనే లోకేశ్ పేరు తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు లోకేశ్ కనకరాజ్. అదే సమయంలో తనకు తెలుగులో నేరుగా సినిమా చేయడం గురించి ప్రశ్న ఎదురయ్యింది.
పెద్ద సినిమా
తెలుగులో నేరుగా సినిమా చేయకపోయినా కూడా చాలామంది టాలీవుడ్ హీరోలతో లోకేశ్ కనకరాజ్‌కు మంచి ర్యాపో ఉంది. అలాగే మెగా హీరో రామ్ చరణ్‌తో కూడా లోకేశ్ కనకరాజ్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. తాజాగా లోకేశ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై స్పందించాడు లోకేశ్. ‘‘నేను రామ్ చరణ్‌తో కలిసి పనిచేస్తే అది నా కెరీర్‌లోనే అదిపెద్ద సినిమా అవుతుంది’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ స్టేట్‌మెంట్‌తో తను రామ్ చరణ్‌పై ఉన్న ప్రేమను బయటపెట్టినా కూడా అది మిగతా హీరోల ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఇప్పటివరకు లోకేశ్ డైరెక్ట్ చేసిన హీరోల ఫ్యాన్స్ అంతా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సెకండ్ బేబీ ప్లానింగ్ గురించి బయటపెట్టిన రణబీర్.. ఏమైనా విశేషమా.?
వాళ్లు స్టార్లు కాదా.?
ఇప్పటికే లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) కమల్ హాసన్, విజయ్ సేతుపతి, విజయ్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు లోకేశ్ కనకరాజ్. వీటన్నింటిని పక్కన పెట్టి మరీ రామ్ చరణ్‌తో చేసే సినిమానే తన కెరీర్‌లో పెద్ద సినిమా అనడంలో అర్థమేంటి అంటూ మిగతా హీరోల ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ ఫ్యాన్ వార్ టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అనే కోణంలో కూడా వెళ్తోంది. ఇప్పటికే చాలామంది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక లోకేశ్ కూడా రామ్ చరణే పెద్ద హీరో అన్నట్టు మాట్లాడడం కోలీవుడ్ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. దీని వల్ల ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యాయి.