E-Paper
Advertisement

గ్యాంగ్‌స్టర్ల రేంజ్‌లో కొట్టుకునే అక్కాచెల్లెళ్ళు… సన్యా మల్హోత్రా ఇలాంటి సినిమా చేసిందా ?

గ్యాంగ్‌స్టర్ల రేంజ్‌లో కొట్టుకునే అక్కాచెల్లెళ్ళు… సన్యా మల్హోత్రా ఇలాంటి సినిమా చేసిందా ?
Advertisement

Comedy Movie on OTT : ‘దంగల్’ (2016)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హిందీ నటి సాన్యా మల్హోత్రా. బబితా కుమారి పాత్రతో గుర్తింపు పొందిన ఆమె, ‘బదాయి హో’, ‘ఫోటోగ్రాఫ్’, ‘పగైత్’, ‘లూడో’, ‘మీనాక్షి సుందరేశ్వర్’ వంటి విభిన్నమైన సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా, కామెడీతో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అయితే ఒక హిందీ సినిమాలో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రాజస్థాన్‌లోని ఒక పల్లెటూరిలో నిరంతరం గొడవపడే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊర్లో ఇద్దరు మొండి ఘటాలు పంతానికి పోతే ఊరంతా ఎలా తమాషా చూస్తుందో, ఈ అక్కాచెల్లెళ్ల గొడవ కూడా అలాగే ఉంటది. అత్తా కోడళ్ల గొడవలు వినుంటాం కానీ, వీళ్లు మాత్రం జుట్లు పీక్కోవడం లాంటి సీన్లతో సినిమాను రక్తి కట్టిస్తారు. మన ఊర్లో ఉండే రచ్చబండ పంచాయితీలు, ఆ నాటు తిట్లు ఈ సినిమాలో కనిపిస్తుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన ఈ హిందీ కామెడీ డ్రామా పేరు ‘పటాఖా’ (Pataakha). 2018లో వచ్చిన ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా, రాధికా మదన్, సునీల్ గ్రోవర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా కోసం హీరోయిన్లు సాన్యా మల్హోత్రా, రాధికా మదన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాజస్థానీ పల్లెటూరి అమ్మాయిల లాగా కనిపించడానికి వీరు జైపూర్ దగ్గరి ఒక గ్రామంలో ఉండి బర్రెల పాలు పితకడం, గడ్డి కోయడం, నెత్తిన నీళ్ల బిందెలు మోయడం వంటి పనులు నేర్చుకున్నారు. అంతేకాకుండా, పెళ్లయ్యాక వచ్చే మార్పుల కోసం వీరిద్దరూ సుమారు 10 కిలోల బరువు పెరిగి, ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొదట ఈ సినిమాకు ‘చురియా’ అని పేరు పెట్టాలనుకున్నా, చివరకు ‘పటాఖా’ అని ఫిక్స్ చేశారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించగా, లెజెండరీ కవి గుల్జార్ పాటలు రాశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు పొందింది. రాధికా మదన్‌కు ఉత్తమ నటిగా అవార్డును తెచ్చిపెట్టింది. prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రాజస్థాన్‌లోని ఒక మారుమూల పల్లెటూర్లో చంపా, గెండా అని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి పిల్లి-ఎలుకలా కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరిని మించి మరొకరు తిట్టడం, జుట్లు పట్టుకుని వీధిలో తన్నుకోవడం వీళ్లకు నిత్యకృత్యం. ఇక వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి డిప్పర్ అనే ఒక నారదుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. పాపం వీళ్ళ తండ్రి మాత్రం, తన కూతుళ్లు ఎప్పటికైనా కలిసి ఉంటారని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక కథలో వీళ్ళిద్దరూ వేర్వేరు కుర్రాళ్లతో ప్రేమలో పడతారు. ఎలాగైనా ఒకరి మొహం ఒకరు చూడకూడదని, అక్కకంటే ముందే పెళ్లి చేసుకోవాలని చెల్లెలు, చెల్లెలు కంటే గొప్పోడిని పెళ్లి చేసుకోవాలని అక్క ప్లాన్లు వేస్తారు. చివరికి ఒకే రోజు, ఒకే టైమ్‌కి తమ తమ ప్రియుళ్లతో కలిసి ఇంటి నుండి పారిపోతారు.

తీరా పెళ్లి చేసుకున్నాక చూస్తే, వీళ్లు పెళ్లి చేసుకున్నది సొంత అన్నదమ్ములని తెలిసి మైండ్ బ్లాక్ అవుతుంది. విడిపోవాలనుకున్న వాళ్ళు కాస్తా, ఒకే ఇంట్లో తోడికోడళ్లుగా అడుగుపెట్టాల్సి వస్తుంది. పగతో రగిలిపోతూ.. చివరికి తెలుసుకున్న నిజంపెళ్లయ్యాక కూడా వీళ్ళ గొడవలు తగ్గవు. ఒకరి కాపురం మరొకరు పాడు చేసుకోవడానికి స్కెచ్‌లు వేస్తారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో, ఒకరి కష్టం వచ్చినప్పుడు మరొకరు పడే ఆవేదన చూసి వాళ్లకు ఒక విషయం అర్థమవుతుంది. తాము ఎంత కొట్టుకున్నా, ఒకరి మీద ఒకరికి ఉన్నది పగ కాదు, అది విడదీయలేని రక్త సంబంధమని తెలుసుకుంటారు. ఆఖరికి ఈ పటాఖాలు కలిసిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తారు.

Advertisement

Read Also : ప్రతి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌… సైకాలజీతో నేరగాళ్లకు చుక్కలు చూపించే ఇన్వెస్టిగేటర్… ఐయండిబిలో 8.2 రేటింగ్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×