Coolie OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth ) హీరోగా.. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పూర్తి రివ్యూ తెలియాలి అంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. కానీ ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాల తర్వాతనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా ఓటీటీలో వారు వారాలకి రాబోతోందని తెలియడంతో అటు ఓటిటి ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
కూలీ సినిమా విశేషాలు..
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కూలీ. నాగార్జున విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా అమీర్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే పూజా హెగ్డే మోనిక పాటతో స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, సౌబిన్ షాహిద్ ఇద్దరు కూడా పోటీపడి మరీ డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.
కూలి సినిమా నటీనటుల రెమ్యూనరేషన్..
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారుగా 400 కోట్ల రూపాయలు ఈ సినిమాకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్న రజినీకాంత్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. విలన్ పాత్ర పోషిస్తున్న నాగార్జున సుమారుగా రూ.24 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అటు అమీర్ ఖాన్ కూడా 15 నిమిషాల కోసం రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ..కానీ దీనిపై క్లారిటీ లేదు. అలాగే ఉపేంద్ర రూ.5కోట్లు, సత్యరాజ్ రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న శృతిహాసన్ రూ.4కోట్లు తీసుకోగా.. స్పెషల్ సాంగ్ చేసిన పూజ హెగ్డే మాత్రం దాదాపు 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే వీరంతా కూడా తమ పెర్ఫార్మన్స్ తో భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. మరి ఇప్పుడు ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాలి అంటే సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
రజినీకాంత్ సినిమాలు..
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. మరొకవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సీక్వెల్ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆఖరిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ALSO READ:Tollywood: నడిరోడ్డుపై బట్టలు అమ్ముకుంటున్న హీరోయిన్.. ఏంటీ కర్మ!