Tollywood: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం ఆసాధ్యం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే దర్శక నిర్మాతలు కూడా చెప్పినట్టు నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఆ సినిమా హిట్ అవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు సెలబ్రెటీలు. అందులో భాగంగానే అటు సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందంతో పాటు ఇటు హీరోయిన్స్ కూడా భారీగా కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ అనేవి ఒక సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడమే కాదు అదే ప్రేక్షకుడిని మెప్పించి.. థియేటర్ కి కూడా రప్పించగలగాలి. దీనికోసం చిత్ర బృందాలు చేయాల్సిందంతా చేసేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలా ఎప్పటికప్పుడు వినూత్న ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పరదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుపమ..
అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ తన సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్డు మీదకు ఎక్కింది. ఏకంగా బట్టలు అమ్ముకుంటూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ చిన్నది.. తాజాగా ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘పరదా’. ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పై ఇప్పటికే చిత్ర బృందం అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
సినిమా కోసం రోడ్డెక్కిన హీరోయిన్..
ప్రమోషన్స్ లో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను అలరించిన అనుపమ.. ఇప్పుడు ఏకంగా రోడ్డుపైకి వచ్చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. పరదా సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే అనుపమ ఇలా రోడ్డుమీదకి వచ్చారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ కోసం వైజాగ్ వెళ్ళిన ఆమె.. అక్కడ రోడ్డుపైన మైకు పట్టుకొని ప్రచారం చేసింది. ” పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగులు పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి” అంటూ కారులో నిలబడి ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇది చూసిన చాలా మంది సినిమా ప్రమోషన్స్ కోసం ఏదైనా చేస్తారా ? ఏంటీ మాకు ఈ కర్మ అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా సినిమా కోసం రోడ్డుపైకి వచ్చి ప్రచారం చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే అనుపమ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పరదా సినిమా విశేషాలు..
‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఆధ్యాత్మిక అంశాలు, సంస్కృతి, వ్యక్తిగత ప్రయాణాల చుట్టూ తిరిగే ఒక కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనుపమ పరమేశ్వరన్. ఇందులో ఈమెతోపాటు దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), సంగీత(Sangeeta ) కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించారు.. అంతేకాదు ఈ సినిమా అనుపమ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని, ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు రివ్యూస్ బాగుంటేనే సినిమా చూడమని కూడా దర్శకుడు కోరారు.
ALSO READ:Ajith: మరో లగ్జరీ కార్ సొంతం చేసుకున్న స్టార్ హీరో.. ధర మామూలుగా లేదుగా?