Illu Illalu Pillalu ToIlluday Episode August 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమకు మాత్రం వీళ్ళిద్దరి మీద అనుమానం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అటు నర్మద కూడా వీళ్ళిద్దరిని అనుమానిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇద్దరు రామరాజు ఇంటి నుంచి బయట పడతారు.. మొత్తానికి ఇంటి నుంచి బయటకు వచ్చామని భాగ్యం ఊపిరి పీల్చుకుంటుంది. రామరాజు మన ఇంట్లో తొలి ధాన్యం వచ్చాయి నీ చేతులతో ధాన్యం తీసుకో అని బుజ్జమ్మకు చెప్తాడు. పెళ్లి పాతికేల్లైనా కూడా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నిన్ను ఎప్పుడూ ఏ మాట అనలేదు.. అయితే ఒక చిన్న అపార్థంతో నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు బుజ్జమ్మ అని అంటాడు. వేదవతి మీరు నన్ను బాధపెట్టిన కూడా మీ మనసు నాకు తెలుసండి అని అంటుంది మొత్తానికి ఇద్దరు కలిసి పోతారు.. నర్మద, ప్రేమ సంతోష పడతారు.. వల్లిని చందు డబ్బులు వెంటనే కావాలి. మీ అమ్మని ఇక్కడికి పిలిపించి డబ్బులు తీసుకురా అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నగల షాప్ కి వెళ్లిన కామాక్షి అక్కడ శ్రీవల్లి ఇచ్చిన ఉంగరాన్ని ఇస్తుంది. డూప్లికేట్ అని తెలియడంతో షాక్ అయ్యి శ్రీవల్లిని అడగడానికి అరుస్తూ ఇంటికి వస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మద వాళ్ళు చూస్తే దొరికిపోతానని గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతుంది.. కచ్చితంగా మా నాన్నకు చెప్పాలని అనుకుంటున్నా అని అంటుంది.. భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా కామాక్షిని ఆపే ప్రయత్నం చేస్తారు. అది చూసిన ప్రేమ నర్మదా ఏమైందని అనుమానంతో ఆలోచిస్తూ ఉంటారు..
అమ్మ కామాక్షి ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు.. పదా ఇలా రా లోపలికి రా అని ఇద్దరు బలవంతంగా కామాక్షిని లోపలికి తీసుకెళ్తారు.. లోపలికి వెళ్లి అసలు విషయం ఏంటో భాగ్యం తెలుసుకుంటుంది. ఈ కామాక్షి ని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. డూప్లికేట్ ఉంగరాన్ని వేరే పని అమ్మాయిది అని చెప్పి తప్పించుకుంటుంది.. తాడేపల్లిగూడెం కాడ ఏర్పోర్ట్ దగ్గర ఉన్న రెండెకరాల పొలాన్ని రాసిస్తాను దాని విలువ 20 కోట్లకు పైగానే ఉంటుందని భాగ్యంఅంటుంది.
ఆ మాట వినగానే కామాక్షి పొంగిపోతుంది.. అయితే ఆ విషయం వినగానే కామాక్షి గాల్లో తేలిపోతూ బయటికి వెళ్లిపోతుంది.. అయితే అక్కడే ఉన్న నర్మద ప్రేమలు ఏమైందో తెలుసుకోవాలని కామాక్షిని ఆపుతారు.. కామాక్షి ఏమి చెప్పకుండా నీకెందుకు చెప్పాలి అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అయితే నర్మద ప్రేమలకు ఇద్దరికీ నగల విషయంలో ఈ వల్లి యొక్క ఏదో దాస్తుంది అని అనుమానం వస్తుంది. నగల మేటర్ ఎంతో కచ్చితంగా తెలుసుకోవాలి బ్యాంకులో పెట్టిన నగలని బయటికి తీసుకురావాలి అని అంటుంది.
ఉదయం లేవగానే వేదవతి రామరాజుకు కాఫీ తెచ్చేస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఇద్దరి సరసాలను చూసి నర్మద ప్రేమ ఇద్దరూ మురిసిపోతారు. అత్తయ్య మామయ్యలు కలిసిపోయారని సంతోషపడతారు.. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇదే మంచి సమయం వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడదామని అనుకుంటారు. ఈ వ్రతం వల్ల నగలు బయటికి వస్తాయి కదా అని నర్మదా ప్రేమతో అంటుంది.. వేదవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య మనం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకుంటాం అని అడుగుతుంది.
వేదవతి ఇదేం విడ్డూరం అమ్మ ఎవరైనా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసం రెండు శుక్రవారం ఏ కదా చేసుకుంటారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇలా అడుగుతారు ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది. అవును కానీ అత్తయ్య అయితే భాగ్యం పిన్ని గారు అందరు ఇక్కడే ఉన్నారు కదా మనం రేపే ఈ వ్రతం చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతుంది నర్మదా. ఇందులో నాదేముందమ్మా? అంతా మీ మావయ్య గారు ఎలా చెప్తే అలానే కదా అని వేదవతి అంటుంది.
Also Read: పల్లవి పై కమల్ కు అనుమానం.. నిజం చెప్పిన భరత్ ఫ్రెండ్.. ప్రణతి పెళ్లి జరుగుతుందా..?
రామరాజు వ్రతం అంటున్నారు కదా చేస్తే మంచిదే కదా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటాడు. వేదవతి నా కోడలు అనిపించుకున్నారు. ఏదైనా అనుకుంటే సాధించే తీరుతారు కదా అని కోడలను చూసి మురిసిపోతూ ఉంటుంది.. అయితే భాగ్యం శ్రీవల్లి వెళ్ళిపోతుంటే నర్మదా వాళ్ళని పిలుస్తుంది. వాళ్లు ముగ్గురు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…