BigTV English

OTT Movie : జెయింట్ అలిగేటర్స్ తో ఒంటరి అమ్మాయి పోరాటం… క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : జెయింట్ అలిగేటర్స్ తో ఒంటరి అమ్మాయి పోరాటం… క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో రకరకాల స్టోరీ లతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు కుర్చీలకు అతుక్కునేలా చేస్తాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే మూవీలో మొసళ్ళు విలన్ పాత్రను పోషిస్తాయి. ఒక పెద్ద తుఫాన్ లో చిక్కుకున్న తండ్రి, కూతుర్లు పెద్ద అలిగేటర్లతో పోరాడాల్సి వస్తుంది. ఈ మూవీ చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘క్రాల్’ (Crawl). 2019 లో వచ్చిన ఈ మూవీకి అలెగ్జాండర్ అజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాయా స్కోడెలారియో, బారీ పెప్పర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక తండ్రి, కూతురు చుట్టూ తిరుగుతుంది. వారు ఫ్లోరిడాలో ఒక పెద్ద తుఫాన్ సమయంలో కుక్కతో పాటు తమ ఇంటి క్రాల్ ప్రదేశంలో చిక్కుకుంటారు. అక్కడ అలిగేటర్ల నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడతారు. పారామౌంట్ పిక్చర్స్ ద్వారా పంపిణీ చేయబడిన క్రాల్ మూవీ జూలై 12, 2019న యునైటెడ్ స్టేట్స్‌లో ప్రీమియర్ షో జరిగింది. ఈ మూవీ విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హేలీ కెల్లర్ అనే యువతి ఒక స్విమ్మర్ గా ట్రైనింగ్ అవుతుంది. ఆమెకు తన సోదరి నుండి ఒక వీడియో కాల్ వస్తుంది. ఫ్లోరిడాలో ప్రమాదకరమైన తుఫాన్ రాబోతోందని హెచ్చరిస్తుంది. వారి తండ్రి డేవ్ ఆ ప్రాంతంలోనే ఉన్నాడని, అతనికి కాల్ కాలవలేదని చెప్తుంది. హేలీ తన తండ్రి గురించి ఆందోళన చెంది, పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా అతన్ని వెతకడానికి బయలుదేరుతుంది.ఆమె తన తండ్రి ఇంటికి చేరుకుని, అతన్ని ఇంటి బేస్‌మెంట్ లో తీవ్రంగా గాయపడిన స్థితిలో కనుగొంటుంది. అతను అలిగేటర్ల దాడిలో చిక్కుకున్నాడని హేలీకి అర్థమౌతుంది. ఇంతలో తుఫాను బలంగా మారడంతో, ఇంట్లోకి వరద నీరు చొచ్చుకొస్తుంది. హేలీ, డేవ్‌లు ఇద్దరూ ఆ నీటిలో చిక్కుకుంటారు. వరద నీరు పెరిగే కొద్దీ, అక్కడ అలిగేటర్ల బెడద కూడా పెరుగుతుంది.

హేలీ తన స్విమ్మింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, తండ్రిని కాపాడుతూ ఆ ప్రాంతం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. వారు ఇంటి నుండి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనిపెడతారు . కానీ అక్కడ కూడా అలిగేటర్లు వారిని వెంబడిస్తాయి. ఈ క్రమంలో డేవ్‌ ఒక అలిగేటర్ దాడిలో తన చేయిని కోల్పోతాడు. హేలీ కూడా ఈ దాడిలో బాగా  గాయపడుతుంది. అయినప్పటికీ ఆమె ధైర్యంగా పోరాడి, ఒక అలిగేటర్‌ను కన్నులో పొడిచి చంపుతుంది. ఇక చేసేదేమీ లేక, వారు ఇంటి పైకప్పు మీదకు చేరుకుంటారు. రెస్క్యూ హెలికాప్టర్‌ను గమనించి సహాయం కోసం సంకేతాలు ఇస్తారు. చివరికి వీళ్ళు ఆ అలిగేటర్ల నుంచి తప్పించుకుంటారా ? రెస్క్యూ టీం వాళ్ళను కాపాడతారా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×