BigTV English

Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్

Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్

Adilabad Airport: తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో బిగ్ గుడ్ న్యూస్. ఆరు నెలల క్రితం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతలోనే మరో ఎయిర్ పోర్టు ఏర్పాటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన అనుమతి మంజూరు చేయడం విశేషం అనే చెప్పవచ్చు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు.


ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు నెలల కింద వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు కూడా అనుమతులు సాధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అక్కడ  వాయుసేన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తెలిపారు. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన లేఖ ద్వారా సూచించిందని మంత్రి చెప్పుకొచ్చారు.

రన్ వే పునర్నిర్మాణ , పౌర టర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్ సహా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు . వీటికి అవసరమైన భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలని వాయుసేన సూచించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ విషయంపై  అధికారులతో సమీక్షిస్తున్నామని.. త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.


స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కష్టానికి ఇదే ఫలితమని మంత్రి చెప్పుకొచ్చారు.. ఈ ఎయిర్ పోర్టును సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు మంత్రి తెలిపారు. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్  అంటే విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి వంటి ఇతర మౌలిక వసతులను డెవలప్ మెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు..

తెలంగాణలో వరంగల్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతులు రావడంలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి, రాష్ట్రంలో ఏయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు అండగా నిలబడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ: CSIR-CRRI Jobs: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. రూ.81,000 జీతం

ALSO READ: BEL Recruitment: బెల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఈ జాబ్ వస్తే రూ.90,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..

Related News

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Senior CPI Leader Sudhakar Reddy: సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల నేతల సంతాపం..

Hydra Ranganath: హైడ్రా అదుర్స్.. రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది..

Serial effect: టీవీ సీరియల్ కోసం.. తల్లి, కొడుకు విషం తాగేశారు.. ఇదేం పిచ్చో!

Hyderabad Police: డీజేలకు నో.. హైదరాబాద్ భక్తులకు పోలీస్ గైడ్ లైన్స్ ఇవే!

Big Stories

×