E-Paper
Advertisement

దృశ్యం – మహారాజా డెడ్లీ కాంబినేషన్ లో మరో మలయాళ సినిమా… క్లైమాక్స్ కి బుర్రపాడు

దృశ్యం – మహారాజా డెడ్లీ కాంబినేషన్ లో మరో మలయాళ సినిమా… క్లైమాక్స్ కి బుర్రపాడు
Advertisement

Crime Thriller Movie on OTT : సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను తీయడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ మంచి పేరే ఉంది. ఆయన తీసిన ‘దృశ్యం’ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెక్కుచెదరలేదు. థ్రిల్లర్ జానర్ అంటే మొదటగా ఈ పేరునే ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో జీతూ జోసెఫ్ ఈ ఏడాది కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కథ కూడా నెమ్మదిగా మొదలై ఆ తర్వాత అనూహ్యమైన మలుపులతో వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ అయితే బుర్ర హీటెక్కిపోతుంది. అలాగే ఇందులో ఒక తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే తీరు మనసుని హత్తుకుంటాయి. పోలీస్ వ్యవస్థలోని అవినీతిని, స్వార్థం కోసం నిజాలను ఎలా తొక్కుతారో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. యాక్షన్ కంటే మైండ్ గేమ్స్, ఎమోషన్స్ ఎక్కువగా ఉండే సీరియస్ సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘వలతు వశతే కళ్ళన్’ (Valathu Vashathe Kallan). ఈ సినిమాను దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, దీన్ని క్యాస్టల్ మూవీస్ బ్యానర్‌పై వి.జి. ఫెలిక్స్ నిర్మించారు. థ్రిల్లర్ సినిమాలకు ప్రాణం పోసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను విష్ణు శ్యామ్ అందించగా, సతీష్ కురుప్ తన కెమెరా పనితనంతో కొచ్చి పరిసరాలను చాలా అద్భుతంగా చూపించారు. సుమారు 135 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందులో బిజు మీనన్, జోజు జార్జ్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వాళ్ళ నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఐయండిబిలో 8.1/10 వంటి మంచి రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఇది తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఆహా (Aha) తో పాటు, మనోరమ మాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఒక పోలీస్ అధికారి. ఆయన తన వృత్తిలో నిజాయితీ కంటే లౌక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఒకరోజు శామ్యూల్ (జోజు జార్జ్) అనే వ్యక్తి ఆంటోనీ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఆంటోనీకి జీవితంలో ఊహించని షాక్ తగులుతుంది. అతని కొడుకు క్షేమంగా తిరిగి రావాలంటే, గతంలో జరిగిన ఒక మర్డర్ కేసును మళ్ళీ విచారించి, అందులోని అసలు నిందితులను పట్టుకోవాలని శామ్యూల్ డిమాండ్ చేస్తాడు. ఇక చేసేదేమి లేక, కొడుకును కాపాడుకోవడానికి ఆంటోనీ ఆ కేసు విచారణ మొదలుపెడతాడు. గతంలో శామ్యూల్ కూతురు ఐరీన్ మరణించినప్పుడు, ఆంటోనీ ఆ కేసును తప్పుదారి పట్టించి నిందితులను కాపాడాడని తెలుస్తుంది. ఈ క్రమంలో దర్యాప్తు సాగుతుండగా, ఆ మర్డర్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు, ఆంటోనీ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఒక అధికారిగా తాను చేసిన అన్యాయం వల్ల ఒక తండ్రికి ఎంతటి అన్యాయం జరిగిందో ఆంటోనీ గుర్తిస్తాడు. తన తప్పును సరిదిద్దుకుని, నిందితులకు శిక్ష పడేలా చేసి, తన కొడుకును ఎలా దక్కించుకున్నాడదే ఈ సినిమా ముగింపు.

Read Also : విమానం హైజాకింగ్‌తో మొదలై రక్త పిశాచిగా టర్న్… నెవర్ బిఫోర్ కథ మావా

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×