Sci Fi Body Horror Thriller Series : ఇప్పటిదాకా మనం వింత వింత వైరస్ లను చూశాం. కరోనా నుంచి ఎబోలా వరకు అన్నీ మనుషులను కబళించినవే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వైరస్ గురించి మాత్రం ఖచ్చితంగా విని ఉండరు. రొమాన్స్ చేసే వచ్చే ఈ వైరస్ ఎంత అందవిహీనంగా ఉన్న మనుషులను అయినఅ క్షణాల్లో అత్యంత అందంగా మారుస్తుంది. కానీ నీళ్ళు తాగితే మాత్రం ఒళ్లు పేలిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో రూపొందిన ఈ మూవీ పేరు ‘ది బ్యూటీ’ (The Beauty 2026). 2026లో విడుదలైన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ బాడీ హార్రర్ థ్రిల్లర్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ అందం కోసం ఆరాటపడే ఆధునిక సమాజపు బలహీనతను వాడుకుని సృష్టించిన ఒక వింత వైరస్ చుట్టూ తిరుగుతుంది. రొమాన్స్ చేసే సంక్రమించే ఈ సరికొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తులు రాత్రికి రాత్రే అత్యంత అందంగా, పర్ఫెక్ట్ గా, కళ్ళు తిప్పుకోలేని శారీరక సౌష్టవంతో, మచ్చలేని చర్మంతో మారిపోతారు. ఇంటర్నేషనల్ మోడల్స్, సెలబ్రిటీలు, సాధారణ మనుషులు కూడా ఈ వైరస్ ను ఒక వరంగా భావిస్తారు. సోషల్ మీడియాలో #TheBeauty అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. అందరూ ఈ అందాన్ని కోరుకుంటారు. కానీ ఈ అందం వెనుక భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ దాగి ఉంటుంది.
వైరస్ సోకిన వారు కొద్ది రోజుల్లోనే వింత శారీరక మార్పులతో, అత్యంత దారుణమైన రీతిలో చనిపోవడం జరుగుతుంది. శరీరం లోపలి నుండి మందుతున్నట్టు వచ్చే ఫీల్ తో బాధపడుతూ, రక్తం కక్కుతూ, అవయవాలు కుళ్లిపోతూ మరణిస్తారు. ఈ వరుస మరణాలు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి ఎఫ్‌బీఐ ఏజెంట్లు కూపర్ మాడ్సెన్, జోర్డాన్ బెన్నెట్ రంగంలోకి దిగుతారు. విచారణలో “ది కార్పొరేషన్” అనే రహస్య మెడికల్ మాఫియా సంస్థ, ఒక టెక్ బిలియనీర్ తమ వ్యాపార సామ్రాజ్యం కోసం ఈ వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు తెలుస్తుంది.
మనుషులను అందం పేరుతో ఆకర్షించి, వారిని తమ అదుపులో ఉంచుకోవడానికి ఈ కుట్ర పన్నారు అని ఏజెంట్లు గ్రహిస్తారు. సిరీస్ ముందుకు సాగుతున్న కొద్దీ పారిస్, రోమ్, న్యూయార్క్ నగరాల మీదుగా హై-వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ గా సాగుతుంది. ఆ బిలియనీర్ తన రహస్యాలు బయట పడకుండా ఉండటానికి పంపే క్రూరమైన హంతకుడి నుండి ఏజెంట్లు తృటిలో తప్పించుకుంటారు. చివరికి మానవజాతిని నాశనం చేయబోతున్న ఈ వైరస్‌కు యాంటీ-డోట్‌ను సాధించడానికి వారు చేసే తీవ్రమైన పోరాటం ఏంటి ? ఆ వైరస్ ను ఎలా అంతం చేశారు ? ఆ మెడికల్ మాఫియా కుట్రను ఎలా బయట పెట్టారు ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
‘ది బ్యూటీ’ సిరీస్ భయంకరమైన సైన్స్ ఫిక్షన్ హార్రర్ థ్రిల్లర్. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, బాడీ హార్రర్ సీన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందం కోసం ఆరాటపడే ఆధునిక సమాజానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పవచ్చు. మన సమాజం ఎంత లోతుగా అందం అనే భ్రమలో కూరుకుపోయిందో చూపించే భయంకరమైన అనుభవం. రయాన్ మర్ఫీ సృష్టించిన ఈ హైప్డ్ సిరీస్ ప్రస్తుతం JioHotstar, Airtel Xstream Play, Tata Play Bingeలలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులో లేదు.
Read Also: మానవ జాతిని తుడిచి పెట్టడానికి దిగొచ్చే ఏలియన్స్… మస్ట్ వాచ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్