E-Paper
Advertisement

బ్రతికొచ్చే శవాలు, చేతబడులు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో ఎపిక్ హర్రర్ థ్రిల్లర్

బ్రతికొచ్చే శవాలు, చేతబడులు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో ఎపిక్ హర్రర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller on OTT‘ : ట్రైన్ టు బుసాన్’ మూవీని ఏ ముహూర్తాన తీశారో గానీ, ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అందులో ఉన్న యాక్టర్స్ కు మంచి పేరు దక్కడమే కాదు, డైరెక్టర్ కు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందుకే ఓటీటీ మూవీ లవర్స్ కూడా ఆయన టేకింగ్ కు ఫిదా అయ్యి, ఆయన తీసిన సినిమాలను వెతికి మరీ చూస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ మూవీనే 2021లో విడుదలై కొరియన్ హారర్ సినిమాల్లో ఒక భయంకరమైన మార్క్ వేసిన చిత్రం ‘The Cursed: Dead Man’s Prey’. మరి ఈ సినిమాకు , ‘ట్రైన్ టు బుసాన్’డైరెక్టర్ కు ఉన్న లింకు ఏంటి ? మూవీ స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఒకరోజు రాత్రి నగరంలో జరిగిన ఘోరమైన హత్యతో స్టార్ట్ అవుతుంది. పోలీసులు హంతకుడి శవాన్ని కూడా చనిపోయిన వ్యక్తి పక్కనే ఉన్నట్టు కనిపెడతారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్టు ఒక భయంకరమైన నిజాన్ని బయట పెడుతుంది. నిజానికి ఆ హంతకుడు మూడు నెలల క్రితమే చనిపోయిన వ్యక్తి. అంటే బ్రతికొచ్చిన శవం అన్నమాట. ఒకసారి చస్తే తిరిగి రావడం అన్నది జరిగే పని కాదు. అందుకే ఈ మిస్టరీని ఛేదించడానికి ధైర్యవంతురాలైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లిమ్ జిన్-హీ రంగంలోకి దిగుతుంది.

Advertisement

ఒక రేడియో షోలో ఉండగా ఆమెకు ఒక గుర్తుతెలియని వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది. తానే ఆ హత్య చేశానని, ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను కూడా బ్రతికొచ్చిన శవాలతో చంపబోతున్నానని లైవ్‌లోనే హెచ్చరిస్తాడు. అన్నట్టుగానే నగరంలో భయంకరమైన దాడులు మొదలవుతాయి. ఒక మంత్రగాడు తన శక్తులతో చనిపోయిన వందలాది శవాలను లేపి నగరంలోకి వదులుతాడు. ఆ శవాల సైన్యం పోలీసులపై, కార్లపై భీకర దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తాయి.

జిన్-హీ ఈ శవాలను ఆపడం సాధారణ మనుషుల వల్ల కాదని గ్రహించి, చైనీస్ అక్షరాలు, ఫోటోలు, వస్తువుల ద్వారా మనుషులను శపించగల ప్రత్యేక శక్తులున్న ఒక టీనేజ్ అమ్మాయి బేక్ సో-జిన్ సహాయం తీసుకుంటుంది. ఆమె సహాయంతో జిన్-హీ ఆ మంత్రగాడి సీక్రెట్ ను వెలికితీస్తుంది. ఆ మంత్రగాడు ఒక ఫార్మా కంపెనీపై పగ తీర్చుకోవడానికి ఈ శవాల సైన్యాన్ని ఉపయోగిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ మంత్రగాడి గతం ఏంటి ? అతను ఇలా శవాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నాడు ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ.

Advertisement

Also Read : కాన్సర్ట్ కోసం బయల్దేరి కనిపించకుండా పోయే గ్యాంగ్… విమానం కూలడంతో కథ కంచికి

తెలుగులో ఉందా ?

‘ది కర్స్డ్: డెడ్ మాన్స్ ప్రే’ సినిమాలో జాంబీ దాడి సీన్స్, చేతబడి సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ట్రైన్ టు బుసాన్’ దర్శకుడు యాన్ సాంగ్-హో ఈ సినిమాకు కథ అందించడం విశేషం. ప్రస్తుతం Amazon Prime Videoలో కొరియన్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.

Related News

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×