Psychological Crime Thriller: ఓటీటీలో లెక్కలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. కానీ అన్నీ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కష్టం. కొన్ని బోల్డ్ కంటెంట్ తో ఉంటాయి. అందులోనూ మరికొన్ని అయితే ఇయర్ ఫోన్స్ లేకుండా చూడలేము. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ కూడా ఒకటి. ‘క్రైమ్ ఆఫ్ డిజైర్’ (Crime of Desire) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ టైటిల్ కు తగ్గట్టే క్రేజీగా ఉంటుంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ సిరీస్ లో మన కథానాయిక పేరు మృణాలిని అలియాస్ మిన్నీ. ఆమె జీవితం ఒక అర్ధరాత్రి అనామక ఫోన్ కాల్ తో ఊహించని టర్న్ తీసుకుంటుంది. జైలు నుంచి ముగ్గురు ప్రమాదకర ఖైదీలు తప్పించుకున్నారని, వారి తదుపరి టార్గెట్ మిన్నీనే అనేది ఆ కాల్ హెచ్చరిక సారాంశం. భయపడిన మిన్నీ వెంటనే పోలీసులను ఆశ్రయిస్తుంది. కేసును దర్యాప్తు చేయడానికి సబ్-ఇన్‌స్పెక్టర్ సుబ్రతా బాధ్యత తీసుకుంటాడు. మరోవైపు హంతకుడు షఫీక్ జైలు నుంచి తప్పించుకున్న సైకోపాత్.
మిన్నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కొక్కరుగా టార్గెట్ చేసి దారుణంగా చంపడం మొదలు పెడతాడు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు భయంకరంగా చనిపోతారు. విచారణలో షఫీక్ గతంలో ఫెయిల్ అయిన ఒక ప్రేమకథ వల్ల హంతకుడిగా మారాడని, ఆ గతం వెనుక మిన్నీ చేసిన ఒక తప్పు దాగి ఉందని తెలుస్తుంది. ప్రేమ నుంచి పుట్టిన వ్యామోహం ఎంతటి ప్రతీకార జ్వాలగా మారిందో చూపించే ఈ సీజన్ ఉత్కంఠ, ట్విస్టులతో సాగుతుంది.
అలాగే దీనికి సీజన్ 2 కూడా ఉంది. సీజన్ 2లో ఆసుపత్రిలో అజ్ఞాత హంతకుడి అరాచకం నడుస్తుంది. డాక్టర్ కనిష్క ఈ ఆసుపత్రిని నడుపుతుంది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా రహస్యంగా హత్యకు గురవుతారు. బయటి నుంచి ఎవరూ రాలేని ఈ క్లోజ్డ్ స్పేస్‌లో హంతకుడు ఎవరు ? ఆ హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటి? అనే ప్రశ్నలు ఆసుపత్రిని భయాందోళనలో ముంచేస్తాయి. డాక్టర్ కనిష్క తన సొంత భద్రతను పక్కన పెట్టి ఈ రహస్యాన్ని వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌లు, సైకలాజికల్ గేమ్స్ ఉంటాయి. ఆసుపత్రిలో దాగి ఉన్న ఆ కిల్లర్ ఎవరు? అతని ఉద్దేశ్యం ఏమిటి ? మొదటి సీజన్ లో ఆ హంతకుడికి మిన్నీతో ఉన్న సంబంధం ఏంటి ? అన్నది ఏంటి తెలియాలంటే ఈ రెండు సీజన్లు చూడాల్సిందే.
ఈ సిరీస్ బెంగాలీ ఒరిజినల్‌గా మొదలై, హిందీ, మలయాళ డబ్బింగ్‌లతో ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. 17 ఎపిసోడ్‌లతో రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్ Hoichoi, Amazon Prime Video, Amazon MX Player, JioTVలలో హిందీ, మలయాళ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో ఇంకా రాలేదు. కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.
Read Also: కొడుకును కోసం కాళీమాతలా మారే తల్లి… మదర్ సెంటిమెంట్ తో మెంటలెక్కించే థ్రిల్లర్