E-Paper
Advertisement

ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ

ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ
Advertisement

Sci fi Romantic Drama: ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ నరకప్రాయం. కొంతమంది త్వరగానే కోలుకున్నా, మరికొంత మందికి జీవితం కాలం పట్టవచ్చు ఆ బాధ నుంచి తేరుకోవడానికి. ఇక జీవితంలో కనిపించరు అనుకున్న ప్రేమికులు మళ్ళీ అదే రూపంలో మన ముందుకు వస్తే… అది కూడా కడుపులో మోసి, కని, పెంచి… కొడుకని కూడా చూడకుండా ప్రేమలో మునిగిపోతే… ఆలోచించడానికి కూడా సాధ్యంకాని ఇలాంటి కథతో తెరకెక్కిన మూవీనే 2010లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘Womb’. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ రెబెక్కా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె చిన్ననాటి స్నేహితుడు థామస్ తో పిచ్చిగా ప్రేమలో పడుతుంది. కానీ రెబెక్కా తల్లితో కలిసి జపాన్ వెళ్లిపోవడంతో వీరిద్దరూ విడిపోతారు. పన్నెండేళ్ల తర్వాత రెబెక్కా తిరిగి తన తాతగారి ఊరికి వస్తుంది. అక్కడ థామస్‌ను మళ్లీ కలుస్తుంది. ఇద్దరి మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. వారు కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. అలాంటి సమయంలో థామస్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. థామస్ మరణం రెబెక్కా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

Advertisement

ఆమె ఆయన జ్ఞాపకాల నుంచి బయట పడలేక, మానసికంగా కుంగిపోతుంది. అప్పటికి క్లోనింగ్ చట్టబద్ధమైన కాలమే… అందుకే రెబెక్కా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. థామస్ డీఎన్‌ఏ సేకరించి, అతని క్లోన్‌ ను తన గర్భంలో మోసి జన్మనివ్వాలనేదే ఆ షాకింగ్ డెసిషన్. థామస్ తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించినా, రెబెక్కా మొండితనానికి ఒప్పుకుంటారు. రెబెక్కా ఒక మగబిడ్డకు జన్మనిచ్చి, అతనికి థామస్ అని పేరు పెడుతుంది.

ఆ బాబు పెరిగే కొద్దీ చనిపోయిన థామస్ పోలికలతోనే ఉంటాడు. సమాజం నుండి వచ్చే విమర్శలను తట్టుకోలేక, రెబెక్కా ఆ బాబును తీసుకుని ఎవరూ లేని ఒక ఒంటరి తీర ప్రాంతానికి వెళ్లిపోతుంది. అక్కడ అతనికి తండ్రి లేడని అబద్ధం చెప్పి పెంచుతుంది. కానీ థామస్ పెద్దవాడై యువకుడిగా మారుతున్న కొద్దీ రెబెక్కాలో ఒక వింతైన మానసిక ఘర్షణ మొదలవుతుంది. ఆమె అతన్ని ఒక కొడుకుగా చూడాలా ? లేక తను ప్రేమించి కోల్పోయిన ప్రియుడిగా చూడాలా ? అనే గందరగోళంలో పడిపోతుంది.

Advertisement

ఒకరోజు థామస్ ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువస్తాడు. ఇది చూసి రెబెక్కా తట్టుకోలేకపోతుంది. తరువాత థామస్‌ కు పాత లాప్‌టాప్ ద్వారా తను ఒక క్లోన్ అని, తనను పెంచుతున్న తల్లికి తను గతంలో ప్రియుడిని అనే భయంకరమైన నిజం తెలిసిపోతుంది. ఈ నిజం తెలుసుకున్న థామస్ తీవ్రమైన షాక్‌ కు, అసహ్యానికి గురవుతాడు. అలా మరో రోజు రాత్రి తీవ్రమైన మానసిక ఆందోళనలో, కోపంలో థామస్ రెబెక్కాతో శారీరక బంధంలో పాల్గొంటాడు. ఆ తర్వాత ఆమెను, ఆ ఇల్లును వదిలేసి ఎటో వెళ్లిపోతాడు. మరి థామస్ మళ్ళీ తిరిగి వచ్చాడా ? ఆ తరువాత రెబెక్కా పరిస్థితి ఏమైంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

ఇది ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ మూవీ. సినిమా చూస్తుంటే మనుషులు అందం, ప్రేమ, జ్ఞాపకాల కోసం ఎంత దూరం వెళ్లగలరో అర్థమవుతుంది. క్లోనింగ్ టెక్నాలజీ వల్ల ఏర్పడే నష్టాలు ఏంటో తెలుసుకోవచ్చు. ఇవా గ్రీన్, మాట్ స్మిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు.

Read Also: భూమి బద్దలై భారీ సింక్‌హోల్… కట్ చేస్తే క్రీస్తు పూర్వం 10000 నాటి పాత కాలంలోకి

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×