BigTV English
Advertisement

OTT Movie : పెళ్లి ఒకరితో మొదటి రాత్రి మరొకరితో… అక్క, చెల్లెళ్ల వెరైటీ లవ్ స్టోరీ

OTT Movie : పెళ్లి ఒకరితో మొదటి రాత్రి మరొకరితో… అక్క, చెల్లెళ్ల వెరైటీ లవ్ స్టోరీ

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో ఫ్యామిలీ డ్రామా సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో అక్క, చెల్లెల మధ్య ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ జరుగుతుంది. చెల్లెలు పెళ్లి చేసుకున్న వ్యక్తితో, అక్క శోభనం చేసుకుంటుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xstreme)

ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు  ‘దాయరీ‘ (Daayree). అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ద్వేషంగా మారితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. చెల్లెలి మీద కోపంతో, ఆమె భర్తతో అక్క మొదటిరాత్రి జరుపుకుంటుంది. ఆమె ఎందుకు అలా చేసిందనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ  ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xstreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

డింపుల్, ఫర ఇద్దరు అక్క చెల్లెలు చిన్నప్పటి నుంచి బాగా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నట్టు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే డింపుల్ కన్నా ఫరా అందంగాను, చురుకుగాను ఉంటుంది. డింపుల్ ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే, ఆ వ్యక్తుల్లో ఏదో ఒక లోపం చూపించి రిజెక్ట్ చేపించేది. ఇలా జరుగుతున్న క్రమంలో డింపుల్ కి పెళ్లి సంబంధాలు వస్తాయి. అయితే డింపుల్ ని చూడడానికి వచ్చే సంబంధాలు, ఫరావైపు మొగ్గు చూపేవాళ్ళు. అక్క పెళ్లి చేసిన తరువాతే చెల్లి పెళ్లి చేస్తామని చెప్పి పంపించే వాళ్ళు తల్లి దండ్రులు. ఇక్కడి వరకు వీళ్లిద్దరి రిలేషన్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత డింపుల్ కి ఒక మ్యాచ్ వస్తుంది. అక్కడికి ఫరని రావద్దని డింపుల్ రిక్వెస్ట్ చేస్తుంది. పెళ్ళికొడుకు కూడా డింపుల్ ని ఓకే చేయాలనుకుంటాడు. ఇంతలోనే ఫర వీళ్లిద్దరి మధ్యకి వస్తుంది. పెళ్ళికొడుకు డింపుల్ ని కాదని, ఫరను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది అక్కకి, చెల్లెలు ఈగో తో ఫీల్ అవుతుందని.

ఆ తర్వాత ఫరకి అతనితో పెళ్లి జరుగుతుంది. అయితే మొదటి రాత్రి ఆమెతో వెళ్లడానికి ముందు, పెళ్ళికొడుకు మద్యం బాగా సేవిస్తాడు. ఒక గదిలోకి వెళ్లాల్సిన పెళ్లి కొడుకు, మరొక గదిలోకి వెళ్తాడు. ఇదే అదునుగా డింపుల్ అతనితో మొదటి రాత్రి జరుపుకుంటుంది. ఎంతసేపటికి పెళ్ళికొడుకు రాకపోవడంతో చెల్లి వెతుకుతూ ఉంటుంది. స్పృహ లేకుండా అక్క గదిలో ఉన్న భర్తని చూసి ఫర షాక్ అవుతుంది. చివరికి చెల్లెలు భర్తతో కాపురం చేస్తుందా? అక్క ఎందుకు ఇలా చేసింది? పెళ్లి కొడుక్కి ఈ విషయం తెలుస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xstreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దాయరీ’ (Daayree) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×