Malayalam Suspense Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్, పక్కా స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ని మైండ్ బ్లాక్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో చిన్న నేపథ్యాన్ని తీసుకొని ఉత్కంఠభరితమైన కథలను చెప్పడంలో అక్కడి మేకర్స్ ప్రత్యేకత చూపిస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక గ్రిప్పింగ్ అండ్ ఒళ్లు గగుర్పొడిచే మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే ‘ICU’. ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ 2026 ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై, రీసెంట్‌గా డిజిటల్ ఆడియన్స్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా కథలో ఉణ్ణి, ఇందు అనే ప్రేమజంట కీలకంగా ఉంటారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు పెరుగుతాయి. తమ బంధం మళ్లీ మునుపటిలా మారాలని ఉణ్ణి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సలామ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అయితే సలామ్ సాధారణ వ్యక్తి కాదు. స్థానికంగా భయంకరమైన గూండాగా పేరున్న మైఖేల్‌కు అనుచరుడు. ఉణ్ణి జీవితంలోకి ఈ వ్యక్తులు ప్రవేశించడంతో పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతాయి.
ఇక కథలోని మెయిన్ స్టోరీ ఆసుపత్రి ఐసీయూ చుట్టూ తిరుగుతుంది. సిటీలోనే మోస్ట్ రెప్యుటెడ్ హాస్పిటల్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఒక రాత్రి ఒక హై-ప్రొఫైల్ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో అడ్మిట్ అవుతాడు. అతనికి అత్యంత కఠినమైన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని ముసుగు దొంగలు అత్యంత ప్లాన్డ్ గా ఆ హాస్పిటల్ ఐసీయూ పై భయంకరమైన దాడి చేస్తారు.
ఇక్కడి నుండి సినిమా టోన్ పూర్తిగా ఒక క్లాస్ట్రోఫోబిక్ సర్వైవల్ థ్రిల్లర్ లా మారిపోతుంది. ఒకవైపు ఐసీయూ బెడ్‌పై ఉన్న పేషెంట్‌ని కాపాడాల్సిన ప్రొఫెషనల్ బాధ్యత, మరోవైపు బయట దాడులు చేస్తున్న క్రిమినల్స్, వీటన్నిటి మధ్య తన సొంత ఫ్యామిలీ ఎమర్జెన్సీని మేనేజ్ చేయలేక ఆ డాక్టర్ ఎదుర్కొన్న మానసిక నరకం రీడర్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ దాడులు చేస్తుంది ఎవరు? దొంగతనం ముసుగులో జరుగుతున్న అసలైన మర్డర్ ప్లాన్ ఏంటి? అనే ట్విస్టులు హడలెత్తిస్తాయి. ఒక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే, వెంటనే ఈ చిత్రాన్ని వాచ్ చేసేయండి.
ఈ చిత్రంలో బిబిన్ జార్జ్ ఉణ్ణి పాత్రలో, బాబురాజ్ మైఖేల్ పాత్రలో నటించారు. విశ్మయ అనీష్ ఇందుగా కనిపించగా, మురళీ గోపీ, శ్రీకాంత్ మురళి, మీరా వాసుదేవన్, నవాస్ వల్లికున్ను తదితరులు కీలక పాత్రలు పోషించారు. జార్జ్ వర్గీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. 1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం నవంబర్ 6 నుంచి Sun NXTలో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.