E-Paper
Advertisement

Nithya Menen: కోలీవుడ్‌లో ఇంతే, ఈ చిన్నచూపే మారాలి.. మేకర్స్‌పై నిత్యా మీనన్ ఓపెన్ కామెంట్స్

Nithya Menen: కోలీవుడ్‌లో ఇంతే, ఈ చిన్నచూపే మారాలి.. మేకర్స్‌పై నిత్యా మీనన్ ఓపెన్ కామెంట్స్
Advertisement

Nithya Menen: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిత్యా మీనన్ పేరే కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళంలో తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘కాదలిక్క నేరమిల్లై’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిత్యా.. ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మామూలుగా నిత్యా మీనన్ మనస్తత్వం ముందు నుండే ప్రేక్షకులకు తెలుసు. ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా తనకు అనిపించింది అనిపించినట్టుగా చెప్పడమే తన మనస్తత్వం. అలా ఎన్నోసార్లు నిత్యా కామెంట్స్ వల్ల ఎన్నో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అయ్యాయి. తాజాగా మరోసారి ఏకంగా తమిళ సినిమాపైనే ఓపెన్ కామెంట్స్ చేసి షాకిచ్చింది నిత్యా మీనన్.

పద్ధతి మారాలి

Advertisement

మామూలుగా ప్రతీ సినిమా ప్రారంభం అయ్యే ముందు టైటిల్ కార్డ్‌లో ముందుగా హీరో పేరు వస్తుంది. ఆ తర్వాతే హీరోయిన్ పేరు వస్తుంది. అలా రావడం తనకు నచ్చదంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలోనే చెప్పేసింది నిత్యా మీనన్. కానీ తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘కాదలిక్క నేరమిల్లై’లో మాత్రం ముందుగా నిత్యా పేరే టైటిల్ కార్డ్స్‌లో కనిపిస్తుంది. అసలు ఇదెలా సాధ్యం అని నిత్మాను ప్రశ్నించగా తను ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘‘కోలీవుడ్‌లో అందరూ ఒక పద్ధతిని పాటిస్తారు. అంటే ముందుగా హీరో పేరు కనిపించాలి, తర్వాత డైరెక్టర్ పేరు కనిపించాలి. ఎప్పుడో చివర్లో హీరోయిన్ పేరు కనిపించాలి’’ అంటూ తను చాలాసార్లు చెప్పిన విషయాన్నే మరోసారి చెప్పుకొచ్చింది నిత్యా మీనన్ (Nithya Menen).

Also Read: ఆ డైరెక్టర్ పై మన్మథుడు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మంచోడే కానీ!

Advertisement

వారికి మాత్రమే చప్పట్లు

‘‘సినిమాల టైటిల్ కార్డ్స్‌లోనే కాదు.. ఏదైనా ఫంక్షన్‌లో అయినా, ఈవెంట్‌లో అయినా, షూటింగ్ సెట్‌లో కారవ్యాన్ దగ్గర అయినా కూడా ముందుగా హీరో, డైరెక్టర్.. ఆ తర్వాతే హీరోయిన్ పేరు కనిపిస్తుంది’’ అంటూ వాపోయింది నిత్యా మీనన్. ‘‘ఇవన్నీ పక్కన పెడితే.. షూటింగ్ సెట్‌లో హీరో ఒక యావరేజ్ సీన్‌లో పర్ఫార్మ్ చేసినా కూడా యూనిట్ మొత్తం చప్పట్లు కొడతారు. కానీ హీరోయిన్ ఒక సీన్‌లో అద్భుతంగా నటించినా కూడా సెట్‌లో అందరూ సైలెంట్‌గా నిలబడి చూస్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి చిన్నచూపు అనేది మారాలి. అలాంటి మార్పులో కాదలిక్క నేరమిల్లై అనేది మొదటి అడుగుగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

హీరో సపోర్ట్

‘కాదలిక్క నేరమిల్లై’ (Kadhalikka Neramillai) టైటిల్ కార్డ్‌లో ముందుగా తన పేరు రావడానికి హీరో జయం రవి కూడా సపోర్ట్ చేశాడని బయటపెట్టింది నిత్యా మీనన్. ఇలా బ్యాక్ టు బ్యాక్ కోలీవుడ్ లేదా టాలీవుడ్‌పై నిత్యా మీనన్ చేస్తున్న కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన బోల్డ్ కామెంట్స్ వల్ల ‘కాదలిక్క నేరమిల్లై’ మూవీకి సరిపడా ప్రమోషన్స్ జరుగుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. తన ఫ్యాన్స్ మాత్రం తన మాటలకు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. తను ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టినప్పుడు కూడా హీరోలకు సమానంగా హీరోయిన్స్‌కు ప్రాధాన్యత దక్కాలని పోరాడేదని గుర్తుచేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×