BigTV English

Daaku Maharaj Collections : బాలయ్య బాదుడు మామూలుగా లేదు… రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

Daaku Maharaj Collections : బాలయ్య బాదుడు మామూలుగా లేదు… రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

Daaku Maharaj Collections : నందమూరి నట సింహం బాలయ్య నుంచి సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీ డాకు మహారాజ్.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జనవరి 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కలెక్షన్లలో బాలయ్య కెరీర్ లోనే ఈ మూవీ భారీ వసూళ్లు సాధించిందనీ, బాలయ్య హీరోయిజం, బాబి టేకింగ్ కి తమన్ బీజీఎం తోడవడంతో యూఎస్ లో మొదటి రోజే 1 మిలియన్ ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలిరోజు మంచి టాక్ రావడంతో జనవరి 13న కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని తెలుస్తుంది. రెండో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ ను అందుకోవడం విశేషం.. ఇక రెండో రోజు కలెక్షన్స్ ఏ రేంజులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. వంటి హిట్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ దర్శకుడు.ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి వాటికి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.. కానీ థియేటర్లలోకి వచ్చిన మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి సృష్టించింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లా లో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరు లో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఫస్ట్ డే నే 56 కోట్లు వసూల్ చేసిందని మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చింది.. బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. రెండు రోజులకు ఎంత రాబాట్టిందో చూద్దాం…

మొదటి రోజు బాక్సాఫీస్ ను దున్నేసిన ఈ మూవీ రెండురోజు కూడా అదే జోరును కొనసాగించింది. మూవీకి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి. డాకు మహారాజు పెళ్లి రోజు కలెక్షన్ 56 కోట్లు వసూలు చేసినట్లు టీం అధికారికంగా ప్రకటించింది దీంతో బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలు లిస్టులో డాకు మహారాజ్ చేరింది రెండో రోజు 35 కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే రెండు రోజులకు గాను కలెక్షన్స్ 91 కోట్లు వసూల్ చేసింది. బాలయ్య సినీ కేరీర్ లో ఇదే రికార్డు బ్రేకింగ్ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 వంటి సినిమాలు ఉన్న నేపథ్యంలో డాకు మహారాజ్ ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబుతుందోనని ట్రేడ్ వర్గాలు, అభిమానులు చర్చించుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌, ఏపీ, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది డాకు మహారాజ్. ఇక ముందు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×